IPL 2021: ఇదేం ఆట డాడీ..! డివిలియర్స్ ఔటవ్వగానే జూనియర్ ఏబీకి కోపం.. కుర్చీని బలంగా తన్నుతూ ఆగ్రహం

Published : Sep 27, 2021, 12:27 PM IST

Ab de villers: ఐపీఎల్ 2021  సెకండ్ ఫేజ్ లో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఇంతవరకు పెద్దగా బ్యాట్ ఝుళిపించలేదు. వరుసగా విఫలమవుతున్న అతడి ఆటతీరుపై ఆ జట్టు అభిమానులతో పాటు ఏబీ కొడుకు కూడా అసంతృప్తితో ఉన్నాడు.  ఆదివారం నాటి పోరులో మిస్టర్ 360 ఔటవ్వగానే అతడు కోపంతో కుర్చీని గట్టిగా తన్నాడు. జూనియర్ ఏబీతో పాటు ముంబయి, బెంగళూరు జట్ల ఆటగాళ్ల భార్యలు, జట్టు సభ్యుల ఫోటోలను వీక్షించండి. 

PREV
16
IPL 2021: ఇదేం ఆట డాడీ..! డివిలియర్స్ ఔటవ్వగానే జూనియర్ ఏబీకి కోపం.. కుర్చీని బలంగా తన్నుతూ ఆగ్రహం

ముంబయితో జరిగిన మ్యాచ్ లో మిస్టర్ 360 కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండు మ్యాచులలో సైతం ఏబీ ప్రదర్శన గొప్పగా ఏం లేదు.  కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో అయితే ఏబీ డకౌట్  అయ్యాడు. 
 

26

ఇక నిన్నటి మ్యాచ్ చూసిన అతడి కొడుకు.. తండ్రి అవుటవ్వగానే కోపంతో ముందున్న కుర్చీని బలంగా తన్నాడు. ‘ఇదేం ఆట డాడీ.. ఎందుకిలా అవుటవుతున్నావు’ అన్నట్టుగా దిగాలుగా ఫేస్ పెట్టాడు. ఈ చిత్రంలో డివిలియర్స్ భార్య తన పిల్లలతో సహా వచ్చి మ్యాచ్ వీక్షించింది. 

36

ఇక బెంగళూరు బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీలో కూర్చుని సందడి చేసింది. నిన్నటి  ఆటలో చాహల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. 

46

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా కూడా మ్యాచ్ వీక్షించింది. రోహిత్ అవుటయ్యాక ఆమె నిరాశతో ఉండిపోయింది.  
 

56

ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో ఆ జట్టు మెంటార్లుగా ఉన్న సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, మహేళ జయవర్ధనే విచారంగా కనిపించారు. 

66

హర్ధిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ గ్లామర్ గా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్ లో హార్థిక్ దారుణంగా విఫలమయ్యాడు. 

click me!

Recommended Stories