రోహిత్, విరాట్ మధ్య గొడవలు నిజమే! రవిశాస్త్రి వచ్చాక సెపరేట్‌గా క్యాంపులు.. - టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్

First Published Feb 4, 2023, 1:36 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఇద్దరు లెజెండరీ స్టార్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నా భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోతోంది. దీనికి కారణం కూడా ఈ ఇద్దరే. రోహిత్, విరాట్ కోహ్లీ ఇగోలకు పోయి, జట్టును సర్వనాశనం చేస్తున్నారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే ఈ ఇద్దరూ చాలా సఖ్యంగా ఉంటారని మరికొందరు కొట్టిపారేస్తారు. తాజాగా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు...

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో సెమీ ఫైనల్‌లో ఓడింది. ధోనీకి అదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ధోనీ టీమ్‌ నుంచి వెళ్లాక రోహిత్, విరాట్ కోహ్లీ మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడేది కాదు. రోహిత్ పోస్ట్ చేసే ఫోటోల్లో విరాట్, కోహ్లీ షేర్ చేసే ఫోటోల్లో రోహిత్ ఉండేవాళ్లు కాదు...

విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలను రోహిత్ శర్మ అన్‌ఫాలో చెయ్యడంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని జోరుగా ప్రచారం జరిగింది. విరాట్ కూడా రోహిత్‌ శర్మను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాడు. 
 

2020 ఐపీఎల్ అయ్యాక టీమిండియా నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే రోహిత్ శర్మ మాత్రం ఇండియాకి తిరిగి వచ్చాడు. రోహిత్  ఎందుకు రాలేదో కూడా తనకి తెలియదని విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో కామెంట్ చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. విరాట్ కోహ్లీ టీ20, వన్డే సిరీస్‌లు ఆడి ఆడిలైడ్ టెస్టు ముగిశాక పెటర్నిటీ లీవ్ కింద స్వదేశానికి తిరిగి వచ్చాడు...

విరాట్ కోహ్లీ ఇటు వచ్చాక రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకి వెళ్లాడు. చివరి రెండు టెస్టుల్లో ఆడి ఆ మ్యాచులకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయని, ఐపీఎల్‌కి ముందు ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ గెలిచాక రవిశాస్త్రి ఇచ్చిన పార్టీ ఫోటోలు బయటికి వచ్చేదాకా తీవ్రంగా ప్రచారం జరిగింది...

‘2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం గురించి చాలా చర్చ జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. విరాట్ క్యాంపు, రోహిత్ క్యాంపు అని టీమ్‌లో రెండు సెపరేట్ గ్రూపులు కూడా ఉండేవి...

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్లాం. అక్కడికి వెళ్లగానే రవిశాస్త్రి, విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మను తన రూమ్‌కి పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలను తుడిచేయాలనుకున్నాడు. సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి.. మీరు ఇద్దరూ టీమ్‌లో సీనియర్ క్రికెటర్లు...

Image credit: Getty

ధోనీ రిటైర్ అయ్యాక ఇప్పుడు మీరు ఇద్దరూ టీమ్‌లో మిగిలిన వారికి రోల్ మోడల్‌గా ఉండాలి. మీ మధ్య ఏమున్నా అవన్నీ పక్కనబెట్టేసి కలిసి ముందుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా.. అని తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరిలోనూ మార్పు వచ్చింది. నవ్వుతూ పలకరించుకోవడం, మాట్లాడుకోవడం మొదలెట్టారు...
 

రవిశాస్త్రి యాక్షన్ ఒక్కటే సమస్య ఎంత పెద్దదైనా దాన్ని సింపుల్‌గా ఎలా ముగించాలో కనుక్కోవడం. ఇద్దరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి, పక్కపక్కన కూర్చోబెట్టి మాట్లాడుకునేలా చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. వైస్ కెప్టెన్ సహకారం లేకుండా కెప్టెన్‌ టీమ్‌ని నడిపించడం కష్టం. ఈ విషయం రవిశాస్త్రికి తెలుసు...

Virat Kohli-Rohit Sharma

శాస్త్రి ఏం చెప్పాలనుకున్నాడో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అర్థమైంది. అందుకే ఇద్దరూ తమ సమస్య ఏంటో కూడా చెప్పలేదు. ఒకరి మీద ఒకరు కంప్లైట్స్ ఇచ్చుకోలేదు. కొత్తగా మొదలెట్టాలని చేతులు కలిపారు. 

ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు.. అన్నింటికి ముందు టీమ్... రవిశాస్త్రి నమ్మింది ఇదే..’ అంటూ తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ - మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్‌లో రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్...

click me!