‘జస్ప్రిత్ బుమ్రా టైం అయిపోయింది! మూడు ఫార్మాట్లు ఆడడం కష్టం... ఏదో ఒక్కటి ఫిక్స్ చేసుకోవాలి...’

First Published Feb 4, 2023, 12:32 PM IST

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గత ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. గాయంతో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లోనూ మొదటి రెండు మ్యాచులు ఆడడం లేదు. ఆఖరి రెండు మ్యాచుల్లో బుమ్రా ఆడతాడనే గ్యారెంటీ కూడా లేదు..

ఐపీఎల్ 2023 సీజన్‌కి జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌గా ఉండేందుకు అతన్ని టీమిండియాకి దూరం పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని హడావుడిగా ప్రకటించి, ఆ తర్వాత మూడు రోజులకు ‘అంతా తూచ్... అతను ఇంకా కోలుకోలేదు’ అంటూ కొట్టిపారేసింది బీసీసీఐ...

Jasprit Bumrah

‘ఇప్పుడు క్రికెట్ షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతున్నారు. మా కాలంలో అలా ఉండేది కాదు. సమ్మర్ సీజన్ అని ఒకటి రెండు సీజన్లు మాత్రమే ఆడేవాళ్లం. సీజన్ మొత్తం ఆడిన తర్వాత కొన్ని నెలలు రెస్ట్ తీసుకునేవాళ్లం. ఇప్పుడు అలా లేదు. క్రికెటర్లకు రెస్ట్ ఉండడమే లేదు...

Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఆడతానంటే అయ్యేపని కాదు. షార్ట్ ఫార్మాట్లు ఆడాలనుకుంటున్నాడా? లేక టెస్టుల్లో కొనసాగాలనుకుంటున్నాడా? అనేది ఇప్పుడే ఫిక్స్ అవ్వాలి. టెస్టు మ్యాచులు ఆడాలంటే పూర్తి ఫిట్‌నెస్ ఉండాలి. అదీకాకుండా షార్ట్ ఫార్మాట్‌ ద్వారా చాలా డబ్బు వస్తోంది...

Image credit: Getty

ఇప్పుడు టీ20 ఫార్మాట్ అనేది చాలా పెద్ద బిజినెస్. ప్రతీ ప్లేయర్ కూడా టీ20 ఫార్మాట్ ఆడడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎన్నేళ్లు ఆడాలని అనుకుంటున్నామో ఆలోచించి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి సంపాదించాలని అనుకుంటున్నారు. అందులో తప్పు కూడా ఏం లేదు...

Image Credit: Getty Images

జస్ప్రిత్ బుమ్రా టీ20లకు పరిమితం కావాలనుకుంటే అప్పుడప్పుడూ వన్డేల్లో కూడా ఆడొచ్చు. అయితే టెస్టుల్లో కొనసాగాలని అనుకుంటే మాత్రం వైట్ బాల్ క్రికెట్‌కి పూర్తిగా దూరమైతేనే బెటర్. ఎందుకంటే ఫిట్‌గా ఉండడం, వర్క్ లోడ్‌ని మేనేజ్ చేయడం చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థామ్సన్...

click me!