ఇప్పుడు కానీ గెలవలేదంటే, అది మీ చేతకానితనమే... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published | Oct 20, 2022, 1:21 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొదటి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతోంది టీమిండియా. గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో మొట్టమొదటి పాకిస్తాన్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఎదురుచూస్తోంది. అయితే జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి కీ ప్లేయర్లు దూరం కావడం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో పాక్ చేతుల్లో ఎదురైన మొట్టమొదటి పరాజయం ఇదే. అయితే అప్పుడు టీమిండియా ఓటమికి బిజీ షెడ్యూల్‌ని కారణంగా చెప్పుకొచ్చింది మేనేజ్‌మెంట్..

టీమిండియా కోచింగ్ స్టాఫ్ కరోనా బారిన పడడంతో అర్ధాంతరంగా ఇంగ్లాండ్ టూర్‌ నుంచి యూఏఈ చేరుకున్న టీమిండియా, ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో పాల్గొంది. అది ముగిసిన వారం రోజులకే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడింది. బిజీ షెడ్యూల్, అలసట కారణంగా టీమిండియా ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిందని వాదించారు మేనేజ్‌మెంట్ సభ్యులు...


Image credit: Getty

‘ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోతే, అది మీ చేతకాని తనమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు కావాల్సినంత సమయం దొరికింది. బిజీ షెడ్యూల్ పేరుతో కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇస్తూ వచ్చారు. చాలామంది ప్లేయర్లు ఈ ఏడాది సగం మ్యాచులు కూడా ఆడలేదు...

టీ20 వరల్డ్ కప్‌ ప్రిపరేషన్స్ కోసం మూడు వారాల ముందే ఆస్ట్రేలియాకి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడిపోయి ఉంటారు. ప్రాక్టీస్ గేమ్స్ ఆడారు... కాబట్టి ప్రిపరేషన్స్‌కి టైం లేదని చెప్పే అవకాశం లేదు..

స్వదేశంలో ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లు కూడా ఆడారు. కాబట్టి టెస్టులు అయ్యాక ఆడాం, వన్డే ఫార్మాట్‌కి వచ్చాం... అని వంకలు చెప్పుకునే ఛాన్స్ కూడా లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ సునీల్ గవాస్కర్...
 

‘ద్వైపాక్షిక సిరీసుల్లో టీమిండియా ఎన్నో ఏళ్లుగా బాగా ఆడుతోతంది. స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ద్వైపాక్షిక సిరీసుల్లో టీమిండియాకి తిరుగేలేదు. అయితే దేశాలు పెరిగితేనే మనోళ్ల పర్ఫామెన్స్ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు భారత జట్టులో యువకులతో పాటు సీనియర్లు కూడా ఉన్నారు...

Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేనంత మాత్రాన టీమిండియా వీక్ అయిపోదు. టీ20 మ్యాచుల ఫలితం ఒకటి రెండు బంతుల్లో మారిపోతుంది. దానికి కావాల్సింది స్కిల్స్‌ని కరెక్ట్ సమయంలో ఎలా వాడాలో తెలియడమే...’ అంటూ వ్యాఖ్యానించాడు సునీల్ గవాస్కర్... 

Latest Videos

click me!