అప్పుడు అశ్విన్‌ని ఆడించకపోవడం, ఇప్పుడు చాహాల్‌ని తీసుకోకపోవడం రెండూ ఒక్కటే... - హర్భజన్ సింగ్

Published : Aug 24, 2023, 02:42 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడని చాహాల్, వన్డే వరల్డ్ కప్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు..

PREV
19
అప్పుడు అశ్విన్‌ని ఆడించకపోవడం, ఇప్పుడు చాహాల్‌ని తీసుకోకపోవడం రెండూ ఒక్కటే... - హర్భజన్ సింగ్
Yuzvendra Chahal

టీమిండియా తరుపున 72 వన్డేలు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 121 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 84 వన్డేలు ఆడి 141 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 177 వన్డేల్లో 194 వికెట్లు తీశాడు. అశ్విన్ 113 మ్యాచుల్లో 151 వికెట్లు తీశాడు.. అక్షర్ పటేల్ 51 వన్డేల్లో 58 వికెట్లు తీశాడు..

29

ఆసియా కప్ 2023 టోర్నీకి రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు, యజ్వేంద్ర చాహా్ల‌ని మాత్రం పూర్తిగా పక్కనబెట్టేశారు. దీనికి ప్రధాన కారణం అతనికి బ్యాటింగ్‌ పెద్దగా రాకపోవడమేనని కూడా కామెంట్ చేశారు.. 

39
Sanju and Chahal

బ్యాటింగ్‌లో యజ్వేంద్ర చాహాల్ 8.62 సగటుతో 69 పరుగులే చేశాడు. వన్డేల్లో చాహాల్ అత్యధిక స్కోరు 18 పరుగులు. కుల్దీప్ యాదవ్ 11.14 సగటుతో వన్డేల్లో 156 పరుగులు చేశాడు. కుల్దీప్ అత్యధిక వన్డే స్కోరు 19 పరుగులు. 
 

49

అయితే వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ చూపించిన ప్రదర్శన ఆధారణంగా యజ్వేంద్ర చాహాల్‌ని పూర్తిగా పక్కనబెట్టేశారు సెలక్టర్లు.  అయితే చాహాల్‌ని టీమ్ నుంచి తప్పించడం, సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..

59
Yuzvendra Chahal Kudeep Yadav

‘ఆసియా కప్ 2023 టీమ్‌లో యజ్వేంద్ర చాహాల్ లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. టీమ్‌కి లెగ్ స్పిన్నర్ అవసరం చాలా ఉంటుంది. అయినా ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌లో యజ్వేంద్ర చాహాల్ కంటే బెటర్ స్పిన్నర్ ఎవ్వరూ లేరు...
 

69

అవును, గత కొన్ని మ్యాచుల్లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. అయితే అతను బ్యాడ్ బౌలర్ అయిపోడు. టీమ్‌లో యజ్వేంద్ర చాహాల్ అవసరం చాలా ఉంది. అది కాకుండా ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కాబట్టి అతన్ని కచ్ఛితంగా టీమ్‌లోకి తీసుకోవాలి..

79

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగి చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించకపోతే, దానికి కూడా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.. 

89

ఎందుకంటే యజ్వేంద్ర చాహాల్ మ్యాచ్ విన్నర్‌గా ఎప్పుడో నిరూపించుకున్నాడు. అతని ఫామ్‌ టెంపరరీ. నా ఉద్దేశంలో సెలక్టర్లు, చాహాల్‌కి రెస్ట్ ఇచ్చి ఉంటారు. అలా అనుకున్నా అతన్ని జట్టుతో పాటు ఉంచాల్సింది. అప్పుడు అతని ఆత్మవిశ్వాసం పెరిగేది...

99

టీమ్ నుంచి తప్పించిన తర్వాత రీఎంట్రీ ఇచ్చే బౌలర్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. బాగా ఆడకపోతే మళ్లీ తీసేస్తారనే మానసిక ఒత్తిడితో సరిగా బౌలింగ్ చేయలేరు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. 

click me!

Recommended Stories