వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్, నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడే జట్టులో దాదాపు 90 శాతం ప్లేయర్లు, వన్డే వరల్డ్ కప్ లోనూ ఆడడం ఖాయం...
ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను స్పిన్నర్లుగా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు..
28
Ravichandran Ashwin
ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు చోటు కల్పించడం, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ స్పిన్నర్లకు చోటు దక్కకపోవడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి..
38
Ravichandran Ashwin
‘రవిచంద్రన్ అశ్విన్‌కి అంతర్జాతీయ క్రికెట్‌లో 712 వికెట్లు ఉన్నాయి. అయినా అతనికి సీనియర్ ప్లేయర్‌గా సరైన గౌరవం దక్కడం లేదు. అశ్విన్ క్వాలిటీ స్పిన్నర్, అంతే క్వాలిటీ ఆల్‌రౌండర్. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత పిచ్‌లపైన అశ్విన్ లాంటి స్పిన్ బౌలర్ అవసరం చాలా ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కర్సన్ గార్వ్రీ..
48
‘ఆస్ట్రేలియాకి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. యజ్వేంద్ర చాహాల్‌ని ఆసీస్ ఆడిస్తే బాగుంటుంది. అతను మ్యాచ్ విన్నింగ్ బౌలర్. అలాగే రవిచంద్రన్ అశ్విన్‌కి 600లకు వికెట్లు తీసిన అనుభవం ఉంది..
58
అదీకాకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అశ్విన్ అనుభవం, సమయస్ఫూర్తి టీమిండియాకి ఎలా ఉపయోగపడ్డాయో కూడా చూశాం. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లోనూ అశ్విన్‌ని ఆడించలేదు..
68
Ravichandran Ashwin
టీమిండియాకి ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా మారనుంది. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్న ప్లేయర్లు, మెంటల్‌గా ఫిట్‌గా ఉండడం లేదు. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లు, తరుచూ గాయపడుతున్నారు. దీన్ని ఎలా సరిచేయాలో మేనేజ్‌మెంట్ దగ్గర ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే బాగుండు..
78
Shubman Gill-Yashasvi Jaiswal
వెస్టిండీస్ టూర్‌లో యశస్వి జైస్వాల్ బాగా ఆడాడు. మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. ఆసియా కప్ జట్టులో అతను ఉండి ఉంటే బాగుండేది.
88
తిలక్ వర్మ గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు కానీ నాకైతే అలాంటి పర్ఫామెన్స్ ఏమీ కనిపించడం లేదు. అయితే అతను బాగా ఆడాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్..