ఆసియా కప్‌‌లో అరుదైన రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఆ రికార్డు కొట్టేదెవరో...

Published : Aug 24, 2023, 02:15 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆగస్టు 30 నుంచి మొదలయ్యే ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ హాట్ ఫెవరెట్ టీమ్స్.. గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ గెలిచిన శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు..   

PREV
16
ఆసియా కప్‌‌లో అరుదైన రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఆ రికార్డు కొట్టేదెవరో...

ఆసియా కప్ ఒకే ఏడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య పేరిట ఉంది. 2008 ఆసియా కప్ ఎడిషన్‌లో 378 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు జయసూర్య. ఇదే సీజన్‌లో సురేష్ రైనా 372, వీరేంద్ర సెహ్వాగ్ 348, కుమార సంగర్కర 345 పరుగులు చశారు..

26

2012 ఆసియా కప్ సీజన్‌లో 357 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్నాడు. 2018 సీజన్‌లో శిఖర్ ధావన్ 342 పరుగులు చేసి టాప్ 5లో ఉన్నాడు.. ఈ రికార్డు ఈసారి బ్రేక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

36

ఆసియా కప్ చరిత్రలో నాలుగు జట్లపై సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. శ్రీలంకపై 108 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, పాకిస్తాన్‌పై 183 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేసిన విరాట్, గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై 122 పరుగులు చేశాడు...
 

46

ఆసియా కప్ చరిత్రలో 1220 పరుగులు చేసిన సనత్ జయసూర్య, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. కుమార సంగర్కర 1075 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 1042 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో 34 పరుగులు చేస్తే, టాప్‌ 2లోకి... ఇంకో 180 పరుగులు చేస్తే టాప్‌లోకి వెళ్తాడు..

56

అలాగే ఆసియా కప్‌ చరిత్రలో 1016 చేసిన రోహిత్ శర్మ కూడా టాప్ ప్లేస్‌లోకి వెళ్లడానికి అవకాశం ఉంది. సచిన్ టెండూల్కర్ 971, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 907 పరుగులు చేసి ఈ లిస్టులో టాప్ 5, 6 స్థానాల్లో ఉన్నారు..

66

ఆసియా కప్‌లో సెంచరీలు చేసిన భారత కెప్లెన్లు సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. సౌరవ్ గంగూలీ, 2000 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 135 పరుగులు చేస్తే, 2014లో అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 136 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ రికార్డును అధిగమించాలంటే రోహిత్ శర్మ ఏదైనా మ్యాచ్‌లో 137 పరుగులు చేయాల్సి ఉంటుంది..

Read more Photos on
click me!

Recommended Stories