90, 2000వ దశకంలో భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా మారిన సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు, వేలాది పరుగులు, లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ పై చెరగని ముద్ర వేశాడు.