88 ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ సముఖత వ్యక్తం చేసింది. 87 ఏళ్లుగా నిరవధికంగా రంజీ ట్రోఫీని నిర్వహిస్తూ వచ్చింది భారత క్రికెట్ బోర్డు...
28
రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఈ క్రికెట్ టోర్నీకి బ్రేకులు పడలేదు. అయితే కరోనా కారణంగా 2020-21 సీజన్‌లో రంజీ ట్రోఫీని నిర్వహించలేదు బీసీసీఐ.
38
సుదీర్ఘమైన రంజీ ట్రోఫీ స్థానంలో విజయ్ హాజారే ట్రోఫీని నిర్వహించింది భారత క్రికెట్ బోర్డు... జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌ను ప్రారంభించాలని భావించింది బీసీసీఐ. అయితే దేశంలో థర్డ్ వేవ్ కేసులు పెరుగుతుండడంతో మరోసారి రంజీ ట్రోఫీని వాయిదా వేయక తప్పలేదు...
48
భారత క్రికెట్‌కి వెన్నెముక లాంటి రంజీ ట్రోఫీని ఎలాగైనా నిర్వహించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ‘భారత క్రికెట్‌కి రంజీ ట్రోఫీ వెన్నుముక వంటిది. రంజీ ట్రోఫీని పట్టించుకోకపోతే భారత క్రికెట్ కూడా వెన్నుపూస లేనిదిగా మారుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...
58
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు, ముగిసిన తర్వాత రంజీ ట్రోఫీని రెండు ఫేజ్‌లుగా నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ఫిబ్రవరిలోనే మొదటి ఫేజ్ ప్రారంభించి, జూన్- జూలై నెలల్లో రెండో ఫేజ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచనలు చేస్తోంది...
68
ఫిబ్రవరిలో లీగ్ స్టేజ్ మ్యాచులన్నీ జరుగుతాయి. జూన్‌లో నాకౌట్ మ్యాచులు జరుగుతాయని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు...
78
‘భారత క్రికెట్‌కి రంజీ ట్రోఫీ చాలా ముఖ్యమైన టోర్నీ. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టోర్నీని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. విపత్తు సమయంలో ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రంజీ ట్రోపీని నిర్వహించేందుకు మార్గాలు వెతుకుతున్నాం.
88
ఈ సుదీర్ఘ టోర్నీలో ఏ ప్లేయర్ అయినా కరోనా బారిన పడినా, మ్యాచులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం...’ అంటూ ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...