ఇప్పుడు టీమిండియాని కాపాడగలిగేది అతనొక్కడే... రాహుల్ ద్రావిడ్‌పై షేన్ వార్న్...

First Published Jan 28, 2022, 12:00 PM IST

సౌతాఫ్రికా టూర్‌కి ముందు పరిస్థితి. టెస్టుల్లో నెం.1 టీమ్‌గా భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైనా ఆ తర్వాత న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది...

సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సారథిగా విరాట్ కోహ్లీని తప్పించి, ఆ బాధ్యతలు విరాట్ కోహ్లీకి అప్పగిస్తూ బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో జట్టులో దుమారం రేగింది...

కేప్‌టౌన్ టెస్టు ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది...

ఆ తర్వాత కెఎల్ రాహుల్ సారథ్యంలో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు, దక్షిణాఫ్రికా చేతుల్లో వైట్ వాష్ అయ్యింది...

‘రాహుల్ ద్రావిడ్ ఓ అద్భుతమైన క్రికెటర్, అంతకుముందు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి... ఆయన జట్టుకి ఎంతో సేవ చేశారు...

ఇప్పుడు భారత జట్టుని పటిష్టంగా చేయగల సత్తా ఆయనలో ఉంది. ఉక్కు మనిషుల్లాంటి ప్లేయర్లను తీసుకొచ్చి, జట్టును బలంగా మార్చగలరు...

అంతకుముందు తన వ్యూహాలతో జట్టుతో అద్భుత ఫలితాలు రాబట్టగలడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టుకి అతనే కరెక్ట్ కోచ్...

అంతర్జాతీయ క్రికెట్‌లో కోచ్ అనే పదం నాకు పెద్గా నచ్చదు. దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది...

అంతర్జాతీయ క్రికెట్‌లో కోచ్ కేవలం ఓ మేనేజర్‌గా మాత్రమే ఉంటాడు. కోచింగ్ ఇవ్వలేదు. క్రికెటర్లుగా నిరూపించుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో వస్తారు...

అలా వచ్చిన ప్లేయర్ల నుంచి జట్టుకి కావాల్సిన ఫలితాన్ని రాబట్టగలగడం మాత్రం కోచ్ పని... ఓ రకంగా ఇది మ్యాన్ మేనేజర్ పని...

రాహుల్ ద్రావిడ్, యువకులను మెంటల్‌గా ప్రభావితం చేయగలడు. ఇప్పుడు టీమిండియా, ద్రావిడ్ కోచింగ్‌లో ఎలా మారుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్...

click me!