గ్రౌండ్‌లో సచిన్ మామని చూసి రెచ్చిపోయిన శుబ్‌మన్ గిల్... గట్టోడివే అంటున్న విరాట్ కోహ్లీ...

First Published Feb 2, 2023, 11:51 AM IST

సచిన్ టెండూల్కర్‌ని ఫ్యాన్స్, ‘మాస్టర్’, ‘లిటిల్ మాస్టర్’, ‘క్రికెట్ గాడ్’ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన్ని ‘శుబ్‌మన్ గిల్ మామ’గా పిలవడం మొదలెట్టారు. శుబ్‌మన్ గిల్ బాగా ఆడినా, ఆడకపోయినా సచిన్ టెండూల్కర్‌, ఆయన కూతురు సారా టెండూల్కర్ ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటారు...

అప్పుడెప్పుడో రెండేళ్ల క్రిందట శుబ్‌మన్ గిల్ ఇన్‌స్టా ఫోటోపై సారా టెండూల్కర్ చేసిన కామెంటు, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వదంతులను పుట్టించింది. దాదాపు రెండేళ్ల పాటు సారా టెండూల్కర్ బాయ్‌ఫ్రెండ్‌గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు శుబ‌్‌మన్ గిల్...
 

శుబ్‌మన్ గిల్ బాగా ఆడిన ప్రతీసారీ, సచిన్ టెండూల్కర్ కాబోయే అల్లుడిని మెచ్చుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యేవి. ఇప్పటికీ అవుతున్నాయి కూడా. ఈ ఏడాది ఆరంభంలో టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్... మొదటి 5 మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...
 

Image credit: PTI

గిల్ ప్లేస్‌లో పృథ్వీ షా లేదా రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్ వంటి ప్లేయర్ ఉంటే... అతన్ని తప్పించి మరో ప్లేయర్‌కి అవకాశం వచ్చి ఉండేది. అయితే ఐపీఎల్‌లో తన టీమ్‌మేట్ కావడంతో శుబ్‌మన్ గిల్‌పై ఎంతో నమ్మకం పెట్టిన హార్ధిక్ పాండ్యా... 2023 సీజన్‌‌కి ముందు ప్రాక్టీస్ దొరికినట్టు కూడా ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని కొనసాగిస్తూ వచ్చాడు...
 

Gill

టీ20ల్లో బాబర్ ఆజమ్ స్ట్రైయిక్ రేటు, శుబ్‌మన్ గిల్ స్ట్రైయిక్ రేటులో పెద్దగా తేడా ఉండదు. అయితే అహ్మదాబాద్‌లో ఒక్కసారిగా శుబ్‌మన్ గిల్ ఆటతీరు జైమని లేచింది. క్రీజులో సచిన్ టెండూల్కర్‌ని చూడగానే ఎడాపెడా బౌండరీలు బాదేసిన గిల్లుడు... 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు...

Gill

శుబ్‌మన్ గిల్‌ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఇన్నింగ్స్‌పై ఇన్‌స్టా వేదికగా ప్రశంసలు గుప్పించాడు. ‘సితార స్టార్... ఫ్యూచర్ ఇక్కడే ఉంది...’ అంటూ శుబ్‌మన్ గిల్‌ని హత్తుకున్న ఫోటోలను పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ...

Gill

టీమిండియాలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత బ్యాటుతో ఆ రేంజ్‌లో ఇరగదీసి, బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ సమక్షంలో సెంచరీ బాది, కోహ్లీ ప్రశంసలు దక్కించుకున్న శుబ్‌మన్ గిల్... ఈ ఇద్దరి తర్వాత ఆ రేంజ్ ప్లేయర్ అవుతాడా? అది తెలియాలంటే చాలా కాలం ఆగాల్సిందే.. 

click me!