అందరూ కలిసి శిఖర్ ధావన్‌ కెరీర్‌కి ముగింపు కార్డు వేసేశారుగా... ఐసీసీ టోర్నీల్లో బాగా ఆడే సీనియర్ కంటే...

First Published Feb 2, 2023, 11:32 AM IST

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం ఐపీఎల్‌లో బాగా ఆడడమే. అయితే ఇది అందరి విషయంలో కాదు. ఎందుకంటే అర డజను మ్యాచుల్లో బాగా ఆడాడని దినేశ్ కార్తీక్‌ని, వెంకటేశ్ అయ్యర్‌ని పిలిచి మరీ ఆడించిన సెలక్టర్లు... వరుసగా రెండు సెంచరీలు బాదిన శిఖర్ ధావన్‌ని మాత్రం టీ20ల్లో పట్టించుకోలేదు...

Image credit: Getty

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ తర్వాత 6 వేల పరుగులు చేసిన బ్యాటర్‌ శిఖర్ ధావన్. అంతేకాదు 2016 నుంచి వరుసగా ప్రతీ సీజన్‌లోనూ 450+ పరుగులు చేస్తూ పోతున్నాడు శిఖర్ ధావన్. ఇప్పుడు టీమిండియాలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా అండ్ కో ఎవ్వరూ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు...
 

Image credit: PTI

అయినా శిఖర్ ధావన్‌ని టీ20ల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీనికి కారణం అతని వయసుని, స్ట్రైయిక్ రేటుని కారణంగా చూపించింది. 37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్, టీమిండియా తరుపున టీ20 వరల్డ్ కప్ ఆడినప్పుడు, శిఖర్ ధావన్‌ని ఆడించడంలో ఇబ్బంది ఏముంది?...
 

ఇక స్ట్రైయిక్ రేటు విషయానికి వస్తే శిఖర్ ధావన్, గత ఐదు ఐపీఎల్ సీజన్లలో 125+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. 2020లో అయినా 144.73 స్ట్రైయిక్ రేటుతో 618 పరుగులు చేశాడు. ఇప్పుడు టీమిండియా తరుపున టీ20ల్లో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ కెరీర్ స్ట్రైయిక్ రేటు కంటే ఇది చాలా ఎక్కువ...
 

Image credit: PTI

అయినా గిల్‌కి మూడు ఫార్మాట్లలో అవకాశాలు ఇచ్చిన సెలక్టర్లు, శిఖర్ ధావన్‌ని పూర్తిగా పక్కనబెట్టేశారు. గిల్ వయసు 23 ఏళ్లు. టీమిండియాకి చాలా కాలం ఉపయోగపడగలడు. అయితే ఇప్పటికిప్పుడు ఆడుతున్న సీనియర్‌ని పక్కనబెట్టి, జూనియర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు...

భారత బ్యాటర్లకు ఎంత ఘనమైన రికార్డు ఉన్నా, ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయ్యేవాళ్లు. అయితే శిఖర్ ధావన్ ఒక్కడూ ఈ విషయంలో మినహాయింపు. ఐసీసీ టోర్నీల్లో అదరగొట్టడం గబ్బర్ స్పెషాలిటీ. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్ గబ్బరే...

Shikhar Dhawan

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో శిఖర్ ధావన్ గాయంతో తప్పుకోకపోతే టీమిండియా ఫేట్ మరోలా ఉండేదేమో. అలాంటి శిఖర్ ధావన్‌ని కావాలని సైడ్ చేసినట్టుగా గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడించలేదు టీమిండియా. అలాగే వచ్చే వన్డే వరల్డ్ కప్ 2023 లోనూ ధావన్‌కి తలుపులు మూసుకుపోయినట్టే...

Image credit: PTI

శుబ్‌మన్ గిల్‌ని త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మార్చిన టీమిండియా, వన్డేల్లో అతను చూపిస్తున్న నిలకడైన ప్రదర్శన ఇప్పట్లో తప్పించే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ఇషాన్ కిషన్ కూడా డబుల్ సెంచరీ బాదేయడంతో శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్టే.. 

Shikhar Dhawan

శిఖర్ ధావన్‌కి ఇక మిగిలిన ఆఖరి హోప్ ఐపీఎల్ 2023 సీజన్. అయితే వచ్చే సీజన్‌లో ధావన్, పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. బ్యాడ్ లక్‌ని ఫ్రంట్ ప్యాకెట్‌లో పెట్టుకునే పంజాబ్ కింగ్స్ ఎంత బాగా ఆడినా ఆరో స్థానం నుంచి పైకి వచ్చేది లేదు... శిఖర్ ధావన్, ఐపీఎల్‌లో ఎంత బాగా ఆడినా సెలక్టర్లు పట్టించుకునేది లేదు... ఇది అందరికీ తెలిసిన ముచ్ఛటే.. 

click me!