ధోనీ రికార్డు బ్రేక్ చేసిన హర్మన్‌ప్రీత్... కోహ్లీ రికార్డును సమం చేసిన స్మృతి మంధాన...

First Published Jul 31, 2022, 7:38 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌ని 8 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా, 38 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ని ముగించేసింది. ఈ విజయంతో భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచింది...

హర్మన్‌ప్రీత్ కౌర్‌కి టీ20 కెప్టెన్‌గా ఇది 42వ విజయం. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ 41 టీ20 మ్యాచుల్లో విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 30 విజయాలు అందుకున్నాడు. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో టాప్ 4లో ఉన్నాడు...

Image credit: PTI

ఇండియా, పాక్ వుమెన్స్ టీ20 మ్యాచుల్లో బంతుల వారీగా ఇదే అతి పెద్ద విజయం. పాక్ జట్టు 99 పరుగులకే ఆలౌట్ అయినా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ని 38 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ని ముగించింది భారత జట్టు. 

ఇంతకుముందు 2018లో జరిగిన మ్యాచ్‌లో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది టీమిండియా...
లక్ష్యఛేదనలో 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన స్మృతి మంధాన, వుమెన్స్ టీ20 ఛేదనలో 1000+ పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచింది...
 

Harmanpreet Kaur

ఇంతకుముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ టీ20 ఛేజింగ్‌లో 977 పరుగులు చేయగా, ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 830 పరుగులతో మూడో స్థానంలో ఉంది.. ఈ రికార్డులో విరాట్ కోహ్లీ 1789 పరుగులతో టాప్‌లో ఉన్నాడు...

టీమిండియా మెన్స్ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 1375 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. స్మృతి మంధాన 1059 పరుగులతో టాప్ 3లో ఉంది. లక్ష్యఛేదనలో టీ20ల్లో 1000+ పరుగులు అందుకున్న మొదటి మెన్స్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాగా స్మృతి మంధాన మొదటి వుమెన్స్ క్రికెటర్...

పాకిస్తాన్‌తో ఆఖరి మ్యాచ్‌లో వన్డేల్లో, టీ20ల్లో హాఫ్ సెంచరీ చేసిన మెన్స్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలవగా, వుమెన్స్ క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ ఇద్దరి జెర్సీ నెంబర్ 18 కావడం విశేషం.. 

click me!