వాళ్లిద్దరే బెస్ట్, మూడో టెస్టులోనూ... ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలపై కెఎల్ రాహుల్...

First Published Jan 7, 2022, 1:18 PM IST

ఆస్ట్రేలియా టూర్ ముగిసినప్పటి నుంచి భారత టెస్టు టీమ్‌లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాల స్థానం గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే విమర్శలు ఎక్కువైన ప్రతీసారి ఓ సెంచరీ భాగస్వామ్యం, చెరో హాఫ్ సెంచరీ చేస్తున్నారు పూజారా, రహానే...

Rahane-Pujara

లార్డ్స్ టెస్టులో సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే... జోహన్‌బర్గ్‌ టెస్టులోనూ టీమిండియా మంచి స్కోరు చేయడానికి కారణమయ్యారు...

Cheteshwar Pujara

తొలి ఇన్నింగ్స్‌లో 33 బంతులాడిన పూజారా 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడం, అజింకా రహానే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది...

టాపార్డర్‌లో కెఎల్ రాహుల్ 50, లోయర్ ఆర్డర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ 46 పరుగులు చేసిన మిగిలిన వాళ్లు పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది భారత జట్టు...

తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 229 పరుగులు చేయడంతో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది. ఈ 27 పరుగులే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేశాయి... సౌతాఫ్రికా విజయావకాశాలను పెంచాయి...

రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

Rahane-Pujara

ఈ దశలో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా కలిసి మూడో వికెట్‌కి 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రహానే 78 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేయగా, పూజారా 86 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేశాడు...

‘పూజారా, రహానే ఇద్దరూ కూడా చాలా గొప్ప ప్లేయర్లు. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకి సేవలు అందిస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా వాళ్లు ఫామ్‌లో లేరనే మాట వాస్తవమే...

ఇప్పుడున్నవారిలో పూజారా, రహానే ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు. ఫామ్‌లో లేకున్నా, టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఈ ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు...

ఈ ఇన్నింగ్స్‌ వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అనుకుంటున్నా. మూడో టెస్టులో ఈ ఇద్దరూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడతారని ఆశిస్తున్నాం... మొదటి ఇన్నింగ్స్‌లో మరో 60+ పరుగులు చేసి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...

గాయం కారణంగా రెండో టెస్టుకి దూరమైన విరాట్, మూడో టెస్టులో రీఎంట్రీ ఇస్తుండడంతో కోహ్లీ కోసం జట్టు నుంచి తప్పుకునే ప్లేయర్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. రెండో టెస్టులో హనుమ విహారి రెండు ఇన్నింగ్స్‌లో ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు ఆడడంతో పోటీ పెరిగింది...

click me!