IND vs SA: కోహ్లి మూడో టెస్టులో ఆడతాడా? లేదా? ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చిన హెడ్ కోచ్.. సిరాజ్ గాయంపైనా స్పష్టత

Published : Jan 07, 2022, 01:17 PM IST

Rahul Dravid Updates On Virat Kohli Health: సౌతాఫ్రికా టూర్ లో ఉన్న భారత జట్టుకు గాయాల బెడద వేధిస్తున్నది. ఇప్పటికే విరాట్ కోహ్లి గాయంతో రెండో టెస్టుకు దూరం కాగా తాజాగా సిరాజ్ కూడా మూడో టెస్టుకు దూరమయ్యే  అవకాశం ఉన్నట్టు సమాచారం.

PREV
111
IND vs SA: కోహ్లి మూడో టెస్టులో ఆడతాడా? లేదా?  ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చిన హెడ్ కోచ్..  సిరాజ్ గాయంపైనా స్పష్టత

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న  టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీరిస్ ప్రారంభంలో గాయంతో టీమిండియా పరిమితి ఓవర్ల సారథి రోహిత్ శర్మ ఈ పర్యటనకు దూరంగా ఉండగా రెండో టెస్టుకు ముందు కోహ్లి కూడా గాయపడ్డ విషయం తెలిసిందే. 

211

అయితే ఇప్పుడు కోహ్లితో పాటు మరో భారత ఆటగాడు గాయం బారిన పడ్డాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కు గాయం కావడంతో అతడు కేప్ టౌన్ టెస్టు ఆడేది అనుమానంగానే మారింది.

311

కోహ్లి.. సిరాజ్ ల గాయాలు, మూడో టెస్టులో వాళ్లు అందుబాటులో ఉంటారా..? లేదా..? అనేదానిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్  ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

411

కోహ్లి హెల్త్ అప్డేట్ ఇస్తూ.. ‘విరాట్ ప్రస్తుతం మెడ నొప్పి నుంచి కోలుకున్నాడు. త్వరలో కేప్ టౌన్ లో నెట్ సెషన్స్ లో పాల్గొంటాని భావిస్తున్నాను. కోహ్లి గాయంపై ఎప్పటికప్పుడూ  డాక్టర్లతో మాట్లాడుతున్నాను. అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను.. ’ అని ద్రావిడ్ తెలిపాడు. 

511

ఇక రెండో టస్టు సందర్భంగా పేసర్ మహ్మద్ సిరాజ్ కు గాయమైన విషయం తెలిసిందే.  అయినా ఆట రెండో రోజు అతడు బౌలింగ్ చేశాడు. కానీ మూడో టెస్టుకు అతడు ఆడేది.. ? లేనిది అనుమానంగా మారింది.

611

ఇదేవిషయంపై ద్రావిడ్ స్పందిస్తూ.. ‘సిరాజ్ నెట్స్ లో కష్టపడాలి.  తొలి ఇన్నింగ్స్ లో గాయంతో సిరాజ్ దూరం కావడం మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీసింది.గాయపడ్డా కూడా అతడు మూడో రోజు బౌలింగ్ కు వచ్చాడు. 

711

ఒకవేళ సిరాజ్ కు తగిలిన గాయం పెద్దదై కేప్ టౌన్ టెస్టుకు అతడు అందుబాటులో లేకుంటే సిరాజ్ స్థానంలో ఉమేష్ యాదవ్ ను గానీ ఇషాంత్ శర్మ ను గానీ తుది జట్టులోకి తీసుకుంటాం. మాకు మంచి బౌలింగ్ బెంచ్ ఉంది...’ అని చెప్పాడు.

811

ఇక రెండో టెస్టులో టీమిండియా ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘ఇక్కడి (దక్షిణాఫ్రికా) పిచ్ లపై బ్యాటింగ్ చేయడం అంత సులువుకాదు. అది రెండు జట్లకు సవాల్ గా మారింది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీ బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. 

911

మేము మరో 50-60 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇక రెండో టెస్టులో వచ్చిన అవకాశాన్ని హనుమా విహారి భాగా ఉపయోగించుకున్నాడు. రెండు ఇన్నింగ్సులలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

1011

గతంలో శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టుకు అవసరమున్నప్పుడు బాగా బ్యాటింగ్ చేశాడు. అవకాశం వచ్చినప్పుడు యువ ఆటగాళ్లు  మెరుగ్గా రాణిస్తున్నారు..’ అని ద్రావిడ్ అన్నాడు. 

1111

ఇక కేప్ టౌన్ లో జరుగబోయే మూడో టెస్టులో విజయం సాధించి దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ నెగ్గుతామని రాహుల్ ద్రావిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సెంచూరియన్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ నెగ్గగా.. వాండరర్స్ లో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories