కోచ్ మారడం వల్లే రిషబ్ పంత్ ఆటలో మార్పు వచ్చిందా... రవిశాస్త్రి కోచింగ్‌లో అలా, రాహుల్ ద్రావిడ్‌తో ఇలా..

Published : Jan 07, 2022, 12:45 PM IST

2020 ఐపీఎల్ తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, గత ఏడాది అద్భుతంగా రాణించాడు. మూడు ఫార్మాట్లలోనూ రీఎంట్రీ ఇచ్చి, టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు...

PREV
114
కోచ్ మారడం వల్లే రిషబ్ పంత్ ఆటలో మార్పు వచ్చిందా...  రవిశాస్త్రి కోచింగ్‌లో అలా, రాహుల్ ద్రావిడ్‌తో ఇలా..

భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీ క్రియేట్ చేసిన అంచనాలను అందుకోలేకపోయాడు...

214

ఎమ్మెస్ ధోనీని తప్పించి, రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇచ్చినా వాటిని సరిగా వాడుకోలేక జట్టుకి దూరమయ్యాడు కూడా. అయితే ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత పంత్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది...

314

ఆడిలైడ్ పరాజయం తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో అవకాశం కల్పించుకున్న రిషబ్ పంత్, సిడ్నీ టెస్టులో 97 పరుగులు చేసి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గబ్బా టెస్టులో 89 పరుగులతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు...

414

బ్రిస్బేన్‌లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్, జోష్ హజల్‌వుడ్ వంటి ఆసీస్ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్‌కి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది...

514

అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు పూర్తి కావడంతో, ఆయన స్థానంలో రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ ఇవ్వడం ఇన్‌డైరెక్ట్‌గా రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్‌పై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది...

614

సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 34 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు... 

714

జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన స్టైల్‌కి విరుద్ధంగా 43 బంతులాడి ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 3 బంతులాడి డకౌట్ అయ్యాడు...

814

మొదటి బంతి నుంచే బౌలర్లపైన అటాక్ చేసే రిషబ్ పంత్, బ్యాటింగ్ స్టైల్‌ మార్చుకోవడానికి కష్టపడుతూ ఇబ్బందిపడుతున్నట్టుగా అతని బ్యాటింగ్ చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతోంది...

914

‘రిషబ్ పంత్ అటాకింగ్ ప్లేయర్. ఆ విధమైన ఆటతీరుతోనే అతను సక్సెస్ అయ్యాడు కూడా. అతని బ్యాటింగ్ స్టైల్ మార్చాల్సిన అవసరం లేదు...

1014

అయితే కేవలం రిషబ్ పంత్ షాట్ సెలక్షన్ గురించి చాలా చర్చించాం. షాట్ టైమింగ్ గురించి చర్చలు జరిపాం... రిషబ్ పంత్ లాంటి దూకుడైన ప్లేయర్‌ని డిఫెన్స్ ఆడమని చెప్పడం కరెక్ట్ కాదు...

1114

అతని ఆటతీరు అలా ఉంటేనే, మ్యాచ్ విన్నర్‌గా మారతాడు. అయితే అనవసర షాట్ సెలక్షన్లతో వికెట్ పారేసుకుంటున్నాడు. టైమింగ్ లోపం వల్ల త్వరగా అవుట్ అవుతున్నాడు... దాన్ని సరిచేయడంపై దృష్టి పెట్టాం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

1214

రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 96 పరుగులు చేసి, సౌతాఫ్రికాకి విజయాన్ని అందించిన సఫారీ టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు రాహుల్ ద్రావిడ్...

1314

‘డీన్ ఎల్గర్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. ఈ విజయంలో అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. క్రీజులో పాతుకుపోయి, రెండు టెస్టుల్లోనూ సౌతాఫ్రికాకి కీలక ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నాడు...

1414

భారత బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడినా, క్రీజులో కుదురుకుపోతే విజయం అందుకోవచ్చనే పాజిటివ్ థింకింగ్‌తో బ్యాటింగ్ చేసి, ఫలితాన్ని అందుకున్నాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్...

Read more Photos on
click me!

Recommended Stories