సింగర్‌కి గొంతు ఎంత ముఖ్యమో, స్పిన్నర్‌కి ఆ వేళ్లు... మొయిన్ ఆలీ గాయంపై నాథన్ లియాన్ కామెంట్...

Published : Jun 20, 2023, 05:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున టైటిల్ గెలిచిన మొయిన్ ఆలీ, టెస్టు రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చి యాషెస్ సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ వెన్ను గాయంతో బాధపడుతుండడంతో మొయిన్ ఆలీని వెనక్కి రప్పించింది ఇంగ్లాండ్ బోర్డు..

PREV
16
సింగర్‌కి గొంతు ఎంత ముఖ్యమో, స్పిన్నర్‌కి ఆ వేళ్లు... మొయిన్ ఆలీ గాయంపై నాథన్ లియాన్ కామెంట్...

ఎగ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో చేతి వేలి గాయంతో బాధపడుతున్న మొయిన్ ఆలీ, అనుకున్నట్టుగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన బౌలర్ల కంటే ఎక్కువగా 33 ఓవర్లు బౌలింగ్ చేసిన మొయిన్ ఆలీ, 2 వికెట్లు పడగొట్టినా 4.5 ఎకానమీతో 147 పరుగులు సమర్పించాడు..

26
Moeen Ali

‘మొయిన్ ఆలీ వేళ్లకు గాయం కావడం మా టీమ్‌కి బాగా కలిసి వచ్చే విషయం. నిజం చెప్పాలంటే అతనికి నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నా. రెండేళ్లుగా టెస్టు క్రికెట్ ఆడలేదు, సడెన్‌గా వచ్చి ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయమంటే ఏ బౌలర్‌ అయినా ఇబ్బంది పడతాడు..

36
Moeen Ali

ఓ రకంగా చెప్పాలంటే సింగర్‌కి గొంతు, స్వరపేటిక ఎంత ముఖ్యమో, స్పిన్నర్‌కి చేతి వేళ్లు అంత అవసరం. మణికట్టు స్పిన్నర్లకు కూడా వేళ్లతో చాలా పని ఉంటుంది. ఫింగర్ స్పిన్నర్ల మ్యాజిక్ అంతా చేతి వేళ్లలోనే ఉంటుంది. అందుకే మొయిన్ ఆలీ బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా నొప్పిని భరిస్తున్నట్టున్నాడు..

46

ఆ నొప్పి నాకు కూడా ఉంటుంది. నేను హోటల్ రూమ్‌లో ఏం చేస్తా అనేది మాత్రం ఇప్పుడే చెప్పను. ఇది ఇక్కడితో వదిలేద్దాం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్.. 

56


తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన నాథన్ లియాన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ హారీ బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాథన్ లియాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

66

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జో రూట్, రెండో ఇన్నింగ్స్‌లో లియాన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. జో రూట్ కెరీర్‌లో స్టంపౌట్ కావడం ఇదే తొలిసారి.. 

click me!

Recommended Stories