వీరేంద్ర సెహ్వాగ్‌ని వెనక్కినెట్టేసిన డేవిడ్ వార్నర్... రెండో టెస్టులో చోటు దక్కితే...

Published : Jun 20, 2023, 03:59 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఒంటరి పోరాటం చేసిన డేవిడ్ వార్నర్, 500+ పరుగులు నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ ఆడిన తర్వాత భారత టాప్ బ్యాటర్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాబట్టే డేవిడ్ వార్నర్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు..

PREV
16
వీరేంద్ర సెహ్వాగ్‌ని వెనక్కినెట్టేసిన డేవిడ్ వార్నర్... రెండో టెస్టులో చోటు దక్కితే...
Image credit: PTI

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులోనూ 50+ స్కోరు నమోదు చేయలేకపోయాడు డేవిడ్ వార్నర్...

26

తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ వార్నర్, రెండో ఇన్నింగ్స్‌లో 57 బంతుల్లో 4 ఫోర్లలతో 36 పరుగులు చేసి ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

36
Image credit: PTI

రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 36 పరుగులతో టెస్టు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 5లోకి ఎంటర్ అయ్యాడు డేవిడ్ వార్నర్. 99 టెస్టుల్లో 50.04 యావరేజ్‌తో 8207 పరుగులు చేసిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని వెనక్కి నెట్టేశాడు డేవిడ్ వార్నర్...

46

105 టెస్టులు ఆడిన డేవిడ్ వార్నర్, 25 సెంచరీలతో 45.60 సగటుతో 8208 పరుగులు చేశాడు. ఈ లిస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ టాప్‌లో ఉన్నాడు. అలెస్టర్ కుక్ 44.86 సగటుతో 11,845 పరుగులు చేసి టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు..

56

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఓపెనర్‌గా 50.29 సగటుతో 9607 పరుగులు చేసి రెండో స్థానంలో ఉండగా సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 9030 పరుగులు, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ 8625 పరుగులతో టాప్ 4లో ఉన్నారు...

66

అయితే డేవిడ్ వార్నర్‌‌కి రెండో టెస్టులో తుది జట్టులో చోటు ఉంటుందా? అనేది అనుమానంగా మారింది. ట్రావిస్ హెడ్‌ని ఓపెనర్‌గా పంపి, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా.. 

click me!

Recommended Stories