అదేం గొప్ప షాట్ కాదు.. ఎవరైనా కొట్టొచ్చు.. కోహ్లీ మెల్‌బోర్న్ మెరుపులపై నోరు పారేసుకున్న సోహైల్ ఖాన్

First Published Feb 3, 2023, 1:01 PM IST

గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ లో  భారత్ చారిత్రత్మక విజయం ఒక ఎత్తైతే  కోహ్లీ  బ్యాటింగ్  మరో ఎత్తు.  ఒత్తిడిని చిత్తు చేస్తూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్.. టీ20 ఫార్మాట్ లో ఆల్ టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్ లలో ఒకటిగా నిలవదగింది.

టీ20 క్రికెట్ చరిత్రలో గొప్పదని భావించదగ్గ  మ్యాచ్ లలో  గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా  జరిగిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఒకటి.   తొలుత పాకిస్తాన్ ను 159 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తర్వాత  లక్ష్య ఛేదనలో  31 పరుగులకే  నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో  టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  (53 బంతుల్లో 82 నాటౌట్,  6 ఫోర్లు,  4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా ( 37 బంతుల్లో 40,  1 ఫోర్, 2 సిక్సర్లు) భారత్ ను ఆదుకున్నారు. 
 

ముఖ్యంగా ఈ మ్యాచ్ మలుపు తిరిగింది  19వ ఓవర్లో.. 8 బంతుల్లో  28 పరుగులు చేయాల్సిన క్రమంలో హరీస్ రౌఫ్ వేసిన  19వ ఓవర్లో కోహ్లీ.. రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాది  మ్యాచ్ లో  భారత్ ను పోటీలోకి తెచ్చాడు. ఇక చివరి ఓవర్లో కూడా మరో భారీ సిక్సర్ తో పాటు   వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తి  మ్యాచ్ ను ముగించాడు.

ఈ మ్యాచ్ లో భారత్ చారిత్రత్మక విజయం ఒక ఎత్తైతే  కోహ్లీ  బ్యాటింగ్  మరో ఎత్తు.  ఒత్తిడిని చిత్తు చేస్తూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్.. టీ20 ఫార్మాట్ లో ఆల్ టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్ లలో ఒకటిగా నిలవదగ్గది.  ఈ మ్యాచ్ ముగిసి మూడు నెలలు కావస్తున్నా..  నిత్యం  ఏదో ఒక అంశానికి సంబంధించి  ఇది ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నది.   ముఖ్యంగా  కోహ్లీ బాదిన ఆ రెండు సిక్సర్ల వీడియో ఇప్పటికీ   యూట్యూబ్ లో ట్రెండింగ్ లోనే  ఉంది. 

అయితే  కోహ్లీ కొట్టిన షాట్లేమీ గొప్పవి కాదంటున్నాడు  పాక్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్.  పాకిస్తాన్ ప్రముఖ   యూట్యూబర్ నాదిర్ అలీ  పోడ్కాస్ట్ లో సోహైల్ మాట్లాడాడు. మెల్‌బోర్న్ లో కోహ్లీ ఆడిన షాట్లు ఆడటం అంత కష్టమా..? అని నాదిర్ అడగగా దానికి సోహైల్  మాట్లాడుతూ.. ‘లేదు. అవేం  అంత కష్టతరమైన షాట్లు కావు.అప్పటికే కోహ్లీ క్రీజులో సెట్ అయి ఉన్నాడు. 

వాస్తవానికి అది చాలా మంచి బాల్.  హార్డ్ లెంగ్త్ బాల్ ను  కోహ్లీ స్ట్రెయిట్ సిక్సర్ బాదాడు.  అలా కాకుండా  కొంచెం బెండ్ అయి  అదే షాట్ ను కవర్స్ మీదుగా కూడా ఆడొచ్చు.  అది మంచి బాల్, మంచి షాట్ అంతే. అంతేగానీ  కష్టమైన షాట్ మాత్రం కాదు..’     అని చెప్పాడు. 

కాగా తన బౌలింగ్ లో   కోహ్లీ షాట్ కొట్టడంపై  కొద్దిరోజుల క్రితం హరీస్ రౌఫ్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ క్లాస్ ఆడగాడు. అటువంటి షాట్లు ఆడటంలో  అతడు దిట్ట. హార్ధిక్ పాండ్యానో మరెవరో ఆ షాట్ కొట్టుంటే నేను బాధపడేవాన్ని గానీ కోహ్లీ  కొట్టాడుగా. నాకేం బాధలేదు..’అని చెప్పిన విషయం తెలిసిందే. 

click me!