మళ్లీ మైక్ పట్టనున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్.. స్వదేశంలో తొలిసారి

Published : Feb 03, 2023, 12:13 PM IST

Border Gavaskar Trophy:  భారత్ - ఆస్ట్రేలియాల మధ్య ఈనెల 9 నుంచి   బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్నది. ఈ సిరీస్ లో  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్  కామెంట్రీ చెప్పబోతున్నాడు. 

PREV
16
మళ్లీ  మైక్ పట్టనున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్.. స్వదేశంలో తొలిసారి

గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు (2021లో)  వెళ్లినప్పుడు సునీల్ గవాస్కర్ తో కలిసి కామెంట్రీ చెప్పిన  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గతేడాది  తిరిగి భారత జట్టుతో కలిశాడు. ఐపీఎల్ - 2022లో మెరవడంతో పాటు  దేశవాళీలో కూడా మెరుగ్గా రాణించడంతో  అతడు  మూడేండ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. 

26

ఐపీఎల్ మెరుపులతో  కార్తీక్ ను  భారత జట్టు స్వదేశంలో పలు సిరీస్ లతో పాటు  ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లో కూడా ఆడించింది.  టీ20 ప్రపంచకప్ లో ఆడాలన్న  తన కల నిజమైనా  భారత్ కప్ సాధించే క్రమంలో  సెమీస్  లోనే చతికిలపడటంతో కార్తీక్ కెరీర్ కు అనధికారిక ఎండ్ కార్డ్ పడింది. 

36

టీ20  ప్రపంచకప్ ముగియగానే   కార్తీక్..  తిరిగి క్రిక్ బజ్ లో క్రికెట్ విశ్లేషకుడిగా మారాడు. వయసు, ఇతరత్రా కారణాలతో అతడు తిరిగి జాతీయ జట్టులోకి రావడం అయ్యే పని కాదు. దీంతో  కార్తీక్ మళ్లీ  పాత వృత్తికే మారాడు. అయితే  గతంలో మాదిరిగా కామెంట్రీ వైపునకు ఇంకా రాకున్నా త్వరలోనే ఆ ముచ్చట కూడా తీర్చుకోనున్నాడు. 

46

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా త్వరలోనే భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ద్వారా   కార్తీక్ తిరిగి మైక్ పట్టనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విటర్ ద్వారా వెల్లడించడం గమనార్హం. 

56

కార్తీక్ ట్విటర్ లో స్పందిస్తూ.. ‘నా కెరీర్ లో   టెస్టు  అరంగేట్రం ఆస్ట్రేలియాతోనే జరిగింది. ఇప్పుడు మళ్లీ  అదే జరుగబోతుంది..’ అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. కామెంట్రీ చెప్పబోతున్నానని కార్తీక్ చెప్పకనే చెప్పాడు.   యాధృశ్చికంగా  కార్తీక్..  2004లో  తన తొలి  అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ను   ఆస్ట్రేలియా మీదే ఆడటం గమనార్హం. 

66

2004లో ముంబైలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరిగిన మ్యాచ్ లో కార్తీక్ అరంగేట్రం చేశాడు.  ఇక తన టెస్టు కెరీర్ లో  ఇప్పటివరకు  26 టెస్టులు ఆడిన కార్తీక్.. 1,025 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.  ధోని  రాకతో  కార్తీక్  టెస్టులతో పాటు వన్డే, టీ20 జట్టులో కూడా కనుమరుగయ్యాడు. అడపాదడపా కనిపించినా అది రెండు మూడు మ్యాచ్ లకే పరిమితం అయింది. 

click me!

Recommended Stories