రోహిత్ శర్మకి అసలైన సవాల్... టెస్టు సిరీస్ రిజల్ట్ తేడా కొడితే కెప్టెన్సీకే ఎసరు పడే ఛాన్స్...

First Published Feb 3, 2023, 12:11 PM IST

టీమిండియా విదేశాల్లో ఎలా ఆడినా, స్వదేశంలో మాత్రం పులుల్లా ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. ద్వైపాక్షిక సిరీసుల్లో వన్డేలు అయినా, టీ20 మ్యాచులు అయినా ఆఖరికి టెస్టు ఫార్మాట్ అయినా పర్యాటక టీమ్‌కి చుక్కలు చూపిస్తుంది.. టెస్టుల్లో టాప్ టీమ్‌గా ఉన్న ఆస్ట్రేలియాపై కూడా ఇదే ఆధిపత్యం చూపించాలని చూస్తోంది రోహిత్ సేన...

రికీ పాంటింగ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆసియాలో కూడా ఆధిపత్యం కనబర్చింది ఆస్ట్రేలియా. 2000 నుంచి 2007 మధ్య ఆసియాలో 15 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా... 11 విజయాలు అందుకుని, మూడింట్లో ఓడింది...

అయితే 2008 తర్వాత ఆసియాలో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడింది. 2008 నుంచి 2022 వరకూ ఆసియాలో 31 టెస్టులు ఆడిన ఆసీస్, 5 మ్యాచులు మాత్రమే గెలవగలిగింది. 18 మ్యాచుల్లో ఓడి, 8 టెస్టులను డ్రా చేసుకుంది...
 

2008 అక్టోబర్‌లో ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఆస్ట్రేలియా జట్టు, భారత జట్టుతో 14 మ్యాచులు ఆడగా ఒకే ఒక్క విజయం అందుకుంది. 10 మ్యాచుల్లో ఓడగా 3 టెస్టులు డ్రాగా ముగిశాయి...2017లో పూణేలో జరిగిన తొలి టెస్టులో ఓడింది భారత జట్టు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017లో ఇండియాలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు, 2018లో ఆసీస్ పర్యటనలో 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. అజింకా రహానే కెప్టెన్సీలో 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టును ఈసారి రోహిత్ శర్మ నడిపించబోతున్నాడు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్‌లో కనీసం 2 మ్యాచులైనా గెలవాల్సి ఉంటుంది టీమిండియా. 10 ఏళ్లుగా ఆస్ట్రేలియాని ఆడుకుంటున్న టీమిండియా, ఇప్పుడు అదే ఆధిపత్యాన్ని కొనసాగించగలదా?
 

టెస్టుల్లో టాప్ టీమ్‌గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, ఈసారి ఇండియాలో ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. రిషబ్ పంత్, అజింకా రహానే, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ వంటి ప్లేయర్లు లేకపోవడం ఆసీస్‌కి కలిసొచ్చే అంశం...

ఇప్పుడు ఈ టెస్టు సిరీస్ ఓడిపోతే, ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు పొరపాటున భారతజట్టు, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటే రోహిత్ కెప్టెన్సీ కెరీర్‌కి ముగింపు కార్డు కూడా పడిపోవచ్చు.. 

విదేశాల్లో రోహిత్ శర్మ టెస్టు యావరేజ్ 33+ మాత్రమే. అయితే స్వదేశంలో మాత్రం రోహిత్ సగటు 73కి పైగా ఉంది. అదీకాకుండా కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉండడం, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా ఫామ్‌ని అందుకోవడం టీమిండియాకి కలిసొచ్చే విషయాలు.. 
 

click me!