సచిన్ టెండూల్కర్‌ని క్రికెట్ గాడ్ అని ఎందుకు పిలుస్తారో ఆ రోజు తెలిసింది... ఆస్ట్రేలియాపై జరిగిన...

Published : May 22, 2021, 12:44 PM IST

క్రికెట్‌లో ఎంతమంది స్టార్ క్రికెటర్లు పుట్టుకొచ్చినా, సచిన్ టెండూల్కర్‌ క్రేజ్‌ను అందుకోలేరు. కేవలం సచిన్ టెండూల్కర్ ఆట చూసేందుకే అన్ని పనులు మానుకుని, టీవీలకు అతుక్కుపోయేవాళ్లు జనాలు. సచిన్ టెండూల్కర్ అవుట్ అయితే, ఇక టీమిండియా ఓడిపోయినట్టే అని ప్రత్యర్థులే కాదు, భారత ప్లేయర్లు కూడా ఫిక్స్ అయిపోయేవాళ్లు.

PREV
111
సచిన్ టెండూల్కర్‌ని క్రికెట్ గాడ్ అని ఎందుకు పిలుస్తారో ఆ రోజు తెలిసింది... ఆస్ట్రేలియాపై జరిగిన...

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండూల్కర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప...

211

‘సచిన్ టెండూల్కర్‌ను యువరాజ్ పిలిచినట్టే, నేను కూడా పాజీ అని పిలుస్తుంటాను. ఆయన బ్యాటింగ్ గురించి అందరికీ తెలిసిందే, అయితే లారా, వీవ్ రిచర్డ్స్, బ్రాడ్‌మన్ వంటి లెజెండ్స్ ఉన్నా సచిన్ టెండూల్కర్‌ను క్రికెట్ గాడ్ అని ఎందుకంటారో నాకు అప్పటిదాకా అర్థమయ్యేది కాదు...

311

2008లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఓపెనింగ్ చేశాను. ఆ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్‌కి గాయమైంది. ఫిట్‌గా లేడు. నొప్పిని పంటిబిగువున దాస్తున్నాడని మాకు తెలుస్తోంది...

411

నేను చాలాసార్లు ‘అంతా ఓకేనా... బాగానే ఉన్నారా?’ అని అడిగి చూశాను. కానీ ఆయన మాత్రం... ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ సమాధానం ఇచ్చి నవ్వుతూ ఉండేవారు. ఎందుకంటే జట్టులో ఆయన ఉండాలి. ఆయన ఉంటే జట్టులో మిగిలిన ప్లేయర్లకు అదో బలం...

511

అందుకే సచిన్ టెండూల్కర్ నొప్పిని భరిస్తూనే మూడు మ్యాచులు ఆడాడు. దానికి నాన్‌స్ట్రైయికింగ్‌లో ఆయన్ని చూస్తూ ఉన్న నేను ప్రత్యేక్ష సాక్షిని...

611

ఆ మ్యాచ్ తర్వాత నాతో మాట్లాడారు. ‘రాబిన్ 30 ఏళ్లు దాటిన తర్వాత ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సుదీర్ఘ కెరీర్ కొనసాగించడం వల్ల గాయాలు తిరగబెడుతూ ఉంటాయి...’ అని అన్నారు.

711

అప్పటికి నా వయసు 22 ఏళ్లే కావడం... ‘అలా ఏం ఉండదు పాజీ’ అని అన్నాను. దానికి ఆయన ‘నీకు 35 ఏళ్ల వచ్చినప్పుడు ఇదే విషయాన్ని చెప్పు చూద్దాం... అప్పుడు నువ్వేం చెబుతావో చూద్దాం’ అని నవ్వేశారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి.

811

ఫిట్‌గా లేకపోయినా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్‌తో సచిన్ టెండూల్కర్ అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో 117 పరుగులు చేసిన టెండూల్కర్, రెండో మ్యాచ్‌లో 91 పరుగులు చేశారు. ఆయన కారణంగానే మేం 2-0తో టైటిల్ దక్కించుకోగలిగాం...

911

అంత నొప్పిని భరిస్తూ మ్యాచులు ఆడాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్‌కి అప్పటికే కావాల్సినంత క్రేజ్, ఫేమ్ వచ్చేసింది. కానీ జట్టు కోసం ఆయన నిలబడాలని ఫిక్స్ అయ్యారు. ఆయన్ని ‘క్రికెట్ గాడ్’ అని ఎందుకంటారో నాకు అప్పుడు అర్థమైంది’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.

1011

2008లో శ్రీలంక, టీమిండియా, ఆస్ట్రేలియా జట్లతో కలిసి కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ నిర్వహించారు. ఇందులో ఒక్కో జట్టు 8 మ్యాచులు ఆడుతుంది. 8 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన ఆసీస్, మూడు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా ఫైనల్ చేరాయి.

1111

ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో మూడు మ్యాచులు జరగగా... సిడ్నీలో, మెల్‌బోర్న్‌లో జరిగిన మొదటి రెండు ఫైనల్స్‌లో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో ఫైనల్ లేకుండానే టోర్నీ ముగిసింది. 

click me!

Recommended Stories