నా కంటే రిషబ్ పంత్ బెటర్, అతనే ఫైనల్ ఆడేందుకు ఫస్ట్ ఛాయిస్... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా...

First Published May 22, 2021, 11:18 AM IST

2020 ఆస్ట్రేలియా టూర్ ముందు వరకూ కూడా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఫస్ట్ ఛాయిస్. అయితే ఆడిలైడ్ టెస్టు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మెల్‌బోర్న్ టెస్టులో తుదిజట్టులోకి వచ్చిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... భారత జట్టుకి మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. దీంతో సాహా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది...

‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రిషబ్ పంత్ ఆడిన మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఫైనల్‌లో కూడా అతనే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్. ఇంగ్లాండ్ టూర్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో కూడా పంత్ కీలకం కానున్నాడు.
undefined
నాకు అవకాశం వచ్చేవరకూ నేను వెయిట్ చేస్తా. అవకాశం వచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా.... ’ అంటూ కామెంట్ చేశాడు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా...
undefined
‘పరిస్థితులను బట్టి మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను కూడా ఎప్పుడూ జట్టు అవసరాలను బట్టి నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా ఆటతీరులో ఏదైనా మార్పు వచ్చిందో లేదో మాత్రం నాకు తెలీదు...
undefined
అవకాశం వచ్చిన ప్రతీసారి పర్ఫామెన్స్ చేయలేం. కొన్నిసార్లు క్లిక్ అవుతాం. కొన్నిసార్లు ఫ్లాప్... మేనేజ్‌మెంట్ ఈ పారామీటర్లన్నీ పరిగణనలోకి తీసుకుని తుదిజట్టుకి ఎంపిక చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా... ఆలస్యంగా బయో బబుల్‌లో చేరబోతున్నాడు. అయితే అతని ఫిట్‌నెస్ అనుమానాలు ఉండడంతో సాహాకి బ్యాకప్‌గా తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌కి అవకాశం దక్కింది.
undefined
వికెట్ కీపర్‌గా కళ్లు చెదిరే క్యాచులు అందుకుంటూ ప్రస్తుత తరంలో వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వృద్ధిమాన్ సాహా. అయితే బ్యాట్స్‌మెన్‌గా మాత్రం అతనికి చెప్పుకోదగ్గ రికార్డు లేదు..
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో రెండో, మూడో టెస్టుల్లో బ్యాటుతో రాణించినా, వికెట్ కీపింగ్‌లో ఈజీ క్యాచులు జారవిడిచాడు రిషబ్ పంత్. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నా, వికెట్ కీపర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
undefined
‘వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ బాగా చేస్తాడు, కానీ బ్యాటింగ్ రాదు. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడు కానీ వికెట్ కీపింగ్‌లో పూర్’ అంటూ భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ కూడా చేశాడు.
undefined
అయితే ఆస్ట్రేలియా టూర్ తర్వాత వికెట్ కీపింగ్‌పై కూడా ఫోకస్ పెంచిన రిషబ్ పంత్, కీపింగ్‌ స్కిల్స్ కూడా మెరుగుపర్చుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కళ్లు చెదిరే క్యాచులు అందుకుని అదరగొట్టాడు.
undefined
click me!