‘పుష్ఫ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ ప్రస్తావన... వార్నర్ భాయ్‌కి థ్యాంక్స్ చెప్పిన ఆ డైరెక్టర్...

Published : Dec 13, 2021, 01:19 PM ISTUpdated : Dec 13, 2021, 01:22 PM IST

పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘పుష్ఫ’ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, టీమ్ యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టకపోవడంతో అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు షెడ్యూల్ ప్రకారం అనుకున్న టైంకి మూవీ రిలీజ్ అవుతుందా? లేదా? అనుకున్నారు...

PREV
111
‘పుష్ఫ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ ప్రస్తావన... వార్నర్ భాయ్‌కి థ్యాంక్స్ చెప్పిన ఆ డైరెక్టర్...

అయితే ఇదే టైమ్‌లో ఊహించని విధంగా ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్, ‘పుష్ఫ’ మూవీ ప్రమోషన్స్‌ను మొదలెట్టాడు. ఒకే ఒక్క వీడియోతో ‘పుష్ఫ’ మూవీ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాడు...

211

డేవిడ్ వార్నర్... కొందరికి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా తెలుసు, ఇంకొందరికీ సాండ్ పేపర్ స్కామ్‌లో ఇరుక్కున్న ఆసీస్ వైస్ కెప్టెన్‌గా తెలుసు. కానీ చాలామంది తెలుగువాళ్లకి మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌గానే తెలుసు...

311

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌గా తెలుగువారికి బాగా దగ్గరైన డేవిడ్ వార్నర్, ‘టిక్ టాక్’ వీడియోలతో టాలీవుడ్ ఫ్యాన్స్‌కి మరింత దగ్గరయ్యాడు....

411

‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే దానికి కారణం డేవిడ్ వార్నర్ ఆ పాటకు స్టెప్పులేసి, బీభత్సంగా ప్రమోట్ చేయడమే...

511

తాజాగా ‘పుష్ఫ’ మూవీలో ‘ఏ బిడ్డా... ఇది నా అడ్డా’ అంటూ వచ్చిన వీడియోను ‘ఫేస్ మార్ఫ్’ యాప్‌తో రూపొందించి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు డేవిడ్ వార్నర్...

611

డేవిడ్ వార్నర్ పోస్టుకి భారత సారథి విరాట్ కోహ్లీ... ‘మేట్ నువ్వు బాగానే ఉన్నావా?’ అంటూ కామెంట్ పెట్టడంతో ‘పుష్ఫ’ మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది...

711

‘నేను బాగానే ఉన్నా మేట్... నీకు తెలుసుగా నా బుర్ర ఎప్పుడూ తిన్నగా ఉండదు...’ అంటూ విరాట్ కోహ్లీకి రిప్లై ఇచ్చాడు డేవిడ్ వార్నర్...

811

‘పుష్ఫ’ మూవీ ద్వారా పాన్ ఇండియా మార్కెట్‌పై టార్గెట్ పెట్టిన అల్లుఅర్జున్ కూడా డేవిడ్ వార్నర్ వీడియోపై స్పందించాడు... ‘మై బ్రదర్, డేవిడ్ వార్నర్... తగ్గేదేలే’ అంటూ కామెంట్ చేశాడు అల్లుఅర్జున్...

911

తాజాగా ‘పుష్ఫ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ డేవిడ్ వార్నర్ ప్రస్తావన వచ్చింది. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సినిమాలతో డైరెక్టర్‌గా మారిన వెంకీ కుడుముల... డేవిడ్ వార్నర్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు...

1011

‘తెలుగు సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్‌కి థ్యాంక్యూ సో మచ్’ అంటూ చెప్పాడు వెంకీ కుడుముల...

1111

వెంకీ కుడుముల నోటి వెంట డేవిడ్ వార్నర్ పేరు రాగానే ఫ్యాన్స్ అంతా కేకలు, అరుపులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోవడం విశేషం...

Read more Photos on
click me!

Recommended Stories