మీకు వేరే ఆప్షన్ లేదు.. సౌతాఫ్రికాతో వన్డేలకు అతడిని ఎంపిక చేయాల్సిందే.. సెలెక్టర్లకు వెంగ్సర్కార్ రిక్వెస్ట్

Published : Dec 13, 2021, 12:45 PM IST

Ruturaj Gaikwad: టీమిండియా యువ ఆటగాడు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ట్రోఫీలో అతడు మూడు సెంచరీలు కూడా బాదేశాడు. 

PREV
19
మీకు వేరే ఆప్షన్ లేదు.. సౌతాఫ్రికాతో వన్డేలకు అతడిని ఎంపిక చేయాల్సిందే.. సెలెక్టర్లకు వెంగ్సర్కార్ రిక్వెస్ట్

దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ, వన్డే జట్టు ఎంపికను వాయిదా వేసింది.  విజయ్ హజారే ట్రోఫీ తర్వాత జట్టును ప్రకటించే అవకాశముంది. ఈ సిరీస్ కు ముందే   విరాట్ కోహ్లీని వన్డేలలో కూడా కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. 

29

రోహిత్ శర్మకు మంచి జట్టును అందించేందుకు  సెలెక్టర్లు ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ తో పాటు 2023 లో  వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కూడా జట్టును ఇప్పట్నుంచే సిద్ధం చేసే విధంగా  సెలెక్టర్లు భావిస్తున్నారు. 

39

అయితే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే జట్టు ఎంపికలో భాగంగా ఈసారి పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించాలని బీసీసీఐ అనుకుంటున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ను సౌతాఫ్రికా టూర్ కు ఎంపిక చేయాలని పలువురు సీనియర్ ఆటగాళ్లు చెబుతున్నారు. 

49

ఇదే విషయమై టీమిండియా మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. ‘ఫామ్ లో ఉన్న ఆటగాడిని మీరు (బీసీసీఐ) సెలెక్ట్ చేయాలి. జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి అతడు ఇంకెన్ని పరుగులు చేయాలి..? 
 

59

ఇప్పటికైనా సెలెక్టర్లు అతడిని జట్టుకు ఎంపిక చేసి అతడిని వన్డే లు ఆడటానికి అవకాశమివ్వాలి..’ అని తెలిపాడు. 

69

అయితే వన్డేలలో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు ఓపెనింగ్ జోడీగా అదరగొడుతున్న నేపథ్యంలో రుతురాజ్ ను ఎంపిక చేసినా ఏ స్థానంలో ఆడిస్తారు..? అన్న ప్రశ్నకు  వెంగ్ సర్కార్ సమాధానం చెబుతూ... ‘గైక్వాడ్  వన్ డౌన్ లో కూడా బ్యాటింగ్ చేయగలడు. జట్టులో అతడికి చోటు కల్పించాలి..’ అని అన్నాడు. 

79

రుతురాజ్ ను జట్టులోకి ఎంపిక చేసే టైం ఇదేనని, ఇప్పుడు కాకుండా ముప్పై ఏళ్లు వచ్చాక తీసుకుని ఏం లాభమని ప్రశ్నించాడు. ‘రుతురాజ్ కు ఇప్పుడు 24 ఏండ్లు. ఇంకెప్పుడు అతడిని జట్టులోకి  తీసుకుంటారు. 28, 30 ఏండ్లు వచ్చాక తీసుకుని ఏం లాభం.. అందులో అర్థం లేదు..’ అని  చెప్పాడు. 

89

గైక్వాడ్.. విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నాడు. తొలి రెండు మ్యాచులలో భాగంగా.. మధ్యప్రదేశ్ తో 136, ఛత్తీస్ గఢ్ తో 154 నాటౌట్ చేసిన  అతడు.. శనివారం కేరళతో జరిగిన మ్యాచులో 124 బాది మూడో సెంచరీ నమోదు చేశాడు. ఆదివారం ఉత్తరాఖండ్ తో జరిగిన మ్యాచ్ లో 24 పరుగులు చేశాడు. 

99
ऑरेंज कैप

విజయ్ హజారేనే గాక..  అక్టోబర్ లో ముగిసిన  ఐపీఎల్-14 లో కూడా రుతురాజ్ అదరగొట్టాడు. ఆ టోర్నీలో 16 మ్యాచులాడిన రుతురాజ్.. 635 పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు, ఒక  సెంచరీ కూడా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories