భారత జట్టులో 100 టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. ప్రస్తుత జట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు మాత్రమే 100+ టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో మాత్రం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు 150+ టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఉంది...
2003 టెస్టు ఆరంగ్రేటం చేసిన జేమ్స్ అండర్సన్, 166 టెస్టు మ్యాచులు పూర్తి చేసుకుని, 632 అంతర్జాతీయ వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు...
213
2007లో టెస్టు ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్, 149 టెస్టులు ఆడి 524 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లాండ్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ తర్వాతి స్థానంలో నిలిచాడు...
313
అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఆడిన స్టువర్ట్ బ్రాడ్, ఆ మ్యాచ్‌లో గాయపడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...
413
యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరిగిన తొలి టెస్టుకి ప్రకటించిన తుది 12 మంది జాబితాలో చోటు దక్కించుకున్న స్టువర్ట్ బ్రాడ్, ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాడు...
513
‘గబ్బా టెస్టులో నాకు చోటు దక్కకపోవడం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే టాస్‌కి కొన్ని సెకన్ల ముందు జరిగిన ఓ ఫన్నీ సంఘటనను చెప్పాలి...
613
టాస్‌కి ముందు ఫీల్డ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, ఆసీస్ గ్రేట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ నా దగ్గరికి వచ్చి 150వ టెస్టు ఆడబోతున్నందుకు నాకు శుభాకాంక్షలు తెలిపాడు...
713
నీకు ఈ రోజు మధురానుభూతులను మిగిల్చాలని కోరుకుంటున్నట్టు మెక్‌గ్రాత్ చెప్పాడు. నేను అతనికి థ్యాంక్స్ చెప్పా, కానీ నేను జట్టులో లేనని కూడా చెప్పాల్సి వచ్చింది...
813
150వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నావని అభినందనలు అందుకుంటున్న సమయంలో నేను టీమ్‌లో లేను... అని చెప్పడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది... సిగ్గుతో మొహం కొట్టేసినట్టైంది..
913
అవును, నేను మొదటి మ్యాచ్ ఆడనందుకు బాగా ఫీల్ అయ్యాను. అయితే ఇది సుదీర్ఘ సిరీస్, ఆఖరి టెస్టు వరకూ ఫిట్‌గా ఉండాలి. ఐదు టెస్టులు ఆడే అవకాశం అందరికీ రాకపోవచ్చు...
1013
అయితే తుదిజట్టులో ఆడిన ప్లేయర్లలో ఒక్క సీమర్ కూడా లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగింది. పరిస్థితులు సీమర్లకు అనుకూలిస్తున్నప్పుడు తుదిజట్టులో సీమ్ బౌలర్‌కి చోటు ఇవ్వకపోవడం కరెక్టు కాదు...
1113
యాషెస్ సిరీస్ ఆడడం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. అందులోనూ గబ్బాలో బౌలింగ్ చేయకపోవడం చాలా స్పెషల్. అక్కడ మ్యాచ్ ఆడి ఉంటే, జట్టుకి కావాల్సిన వికెట్లు తీసేవాడిననే నమ్మకమైతే ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్...
1213
ఆడిలైడ్‌లో జరిగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా రెండో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్‌తో పాటు జేమ్స్ అండర్సన్ కూడా ఆడబోతున్నారని సమాచారం. ఈ ఇద్దరి జోడీకి టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది...
1313
గబ్బాలో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లాండ్ జట్టు. ఓల్లీ రాబిన్‌సన్ 4 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 3, క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశారు.