ఇవన్నీ టైం వేస్ట్ యవ్వరాలు! డీఆర్‌ఎస్ వల్ల ఒరిగేదేమీ లేదు... హర్షల్ పటేల్ కామెంట్...

First Published Mar 29, 2023, 12:59 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో రికార్డును సమం చేసి, లేటు వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు హర్షల్ పటేల్. భారత జట్టులోకి వచ్చిన కొత్తలో అదరగొట్టిన హర్షల్ పటేల్, ఆ తర్వాత రిథమ్ కోల్పోయి టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయాడు...

ఆసియా కప్‌ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ కూడా గాయపడ్డాడు. గాయంతో ఆసియా కప్ ఆడని హర్షల్ పటేల్, ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి కొన్ని టీ20 సిరీస్‌లు ఆడాడు. అయితే ధారాళంగా పరుగులు సమర్పించడంతో అతన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించే సాహసం చేయలేదు టీమిండియా...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌తో పాటు హర్షల్ పటేల్ కూడా పూర్తిగా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ 2023 టోర్నీలో రాణించి, తిరిగి టీమిండియాలోకి రావాలని అనుకుంటున్నాడు హర్షల్ పటేల్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో వైడ్ బాల్‌కి, నో బాల్‌కి డీఆర్‌ఎస్ తీసుకునేందుకు ప్లేయర్లకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు హర్షల్ పటేల్...

Harshal Patel

‘బ్లాక్ అండ్ వైట్‌ని సెపరేట్ చేసేందుకు టెక్నాలజీ కచ్ఛితంగా సహాయపడుతుంది. అయితే ఇప్పుడు వాడుతున్న బంతులు గ్రే కలర్‌లో ఉంటాయి. వైడ్ బాల్ లైన్స్‌ని చూసి, వైడ్‌ని డిసైడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బ్యాటర్‌ ఎంత కదిలాడు, కదిలిన దూరాన్ని ఎలా కొలుస్తారు?

Harshal Patel

బ్యాటర్ కదిలిన తర్వాత బ్యాటుకి అందేంత దూరంలో బంతి ఉందా? డెలివరీ యాంగిల్ ఎలా ఉంది? అంతేకాకుండా రైట్ హ్యాండ్ బ్యాటర్‌కి వేసే డెలివరీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కి వేసే డెలివరీ ఒకే యాంగిల్‌లో ఉండదు..

వైడ్‌ డిసైడ్ చేయాలంటే ఇవన్నీ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. రైట్ హ్యాండ్ బ్యాటర్‌ కాస్త పక్కకి జరిగితే ఈజీగా అందే బంతి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కి అందకపోవచ్చు. అందుకే వైడ్ బాల్‌ని డిసైడ్ చేయడంలో చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.

డీఆర్‌ఎస్ ద్వారా ఈ విషయాలన్నీ పరిశీలించాలంటే చాలా సమయం పడుతుంది...  అందుకే నా ఉద్దేశంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే వదిలేయడం బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు హర్షల్ పటేల్...

click me!