అటు ఆట ఇటు మాట.. ఫుల్ స్వింగ్‌లో దినేశ్ కార్తీక్.. ఐపీఎల్ ముగిసిన వెంటనే కీలక టోర్నీకి కామెంట్రీ

Published : Mar 29, 2023, 12:40 PM IST

IPL 2023: భారత జట్టు 2021లో   ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా  కార్తీక్..  సునీల్ గవాస్కర్ తో కలిసి  కామెంట్రీ  బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత తిరిగి  దేశవాళీతో పాటు ఐపీఎల్ కూడా మెరిసి  మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు.  ఇక ఇప్పుడు.. 

PREV
16
అటు ఆట ఇటు మాట.. ఫుల్ స్వింగ్‌లో దినేశ్ కార్తీక్.. ఐపీఎల్ ముగిసిన వెంటనే కీలక టోర్నీకి కామెంట్రీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్  లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ) తరపున    ఆడనున్న  వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్  ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.  ఈ తమిళ తంబీ..  ఇటీవలే ముగిసిన   బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో   భాగంగా   కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.. 

26

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో కూడా  కార్తీక్.. క్రిక్ బజ్ లో క్రికెట్ అనలిస్టుగా మ్యాచ్ లను విశ్లేషించాడు.  ఆ తర్వాతే ఐపీఎల్ డ్యూటీలను తీసుకోబోతున్న   కార్తీక్.. ఇది ముగిసన వెంటనే మళ్లీ మైక్ పట్టనున్నాడు.  ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే యాషెస్ లో  అతడు కామెంటేటర్ గా చేయనున్నాడు. 

36

2021 లో   ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్.. ఈసారి ఇంగ్లాండ్ లో జరుగనున్నది.  జూన్ 16 నుంచి ఇంగ్లాండ్ - ఆసీస్ లు   యాషెస్ సమరంలో పాల్గొనబోతున్నాయి. ఈ మెగా సిరీస్ కు  మైకెల్ అథర్టన్, నాసిర్ హుసేన్, మైఖేల్ క్లార్క్, డేవిడ్ లాయిడ్ లతో పాటు   కార్తీక్ కూడా కామెంట్రీ చేయనున్నాడని తెలుస్తున్నది.  
 

46

భారత జట్టు 2021లో   ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా  కార్తీక్..  సునీల్ గవాస్కర్ తో కలిసి  కామెంట్రీ  బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత తిరిగి  దేశవాళీతో పాటు ఐపీఎల్ కూడా  మెరుపులు మెరిపించి ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించాడు.  2022లో  టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్  స్థానంలో  భారత జట్టు.. గతేడాది టీ20 వరల్డ్ కప్  లో కూడా  ఆడించింది. 

56

కానీ  భారత జట్టు ప్రపంచకప్ కలలు  సెమీస్ లోనే ముగిసిపోయాయి. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో  భారత్ ఓడటంతో    టీమిండియా ఇంటికి పయనమైంది. కార్తీక్ కెరీర్ లో ఇదే ఆఖరు మ్యాచ్ (?). టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే తిరిగి తన పాత డ్యూటీ (కామెంట్రీ) ఎక్కిన  కార్తీక్ ఐపీఎల్ లో  మళ్లీ క్రికెటర్ గా మారనున్నాడు.  

 

66

గతేడాది ఐపీఎల్ లో  కార్తీక్..  ఆర్సీబీకి ఫినిషర్  పాత్ర పోషించాడు. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించాడు.    183 స్ట్రైక్ రేట్  తో 330 పరుగులు చేశాడు.  ఈ ఏడాది కూడా కార్తీక్ ఇవే మెరుపులు మెరిపించాలని ఆర్సీబీ కోరుకుంటున్నది.    ఈ సీజన్ లో భాగంగా బెంగళూరు.. ఏప్రిల్ 2న  స్వంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ద్వారా  సీజన్ ను  ప్రారంభించనున్నది. 

click me!

Recommended Stories