ధోనీ కాదు, విరాట్ కోహ్లీ కూడా కాదు! ఐపీఎల్‌లో అసలైన G.O.A.T అతనే... - అనిల్ కుంబ్లే కామెంట్...

First Published Mar 29, 2023, 12:08 PM IST

ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ.. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ 5 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. కెప్టెన్‌గా ధోనీ, సీఎస్‌కే టీమ్‌ని 9 సార్లు ఫైనల్ చేర్చి, 4 టైటిల్స్ అందించాడు...
 

ఐపీఎల్‌లో ఆల్‌టైం గ్రేట్ ప్లేయర్ల లిస్టులో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు తప్పక ఉంటాయి. అయితే ఈ ఇద్దరి కంటే ‘యూనివర్సల్ బాల్’ క్రిస్ గేల్‌ని ‘ఆల్‌టైం గ్రేట్ ప్లేయర్’ అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే...

‘ఐపీఎల్‌లో చాలామంది గొప్ప ప్లేయర్లు ఉన్నారు. అందులో నుంచి ఒక్కరిని సెలక్ట్ చేయడం చాలా కష్టం. అయితే ఇప్పటిదాకా జరిగిన సీజన్లన్నీ చూసిన వాడిగా క్రిస్ గేల్‌ని ఆల్‌టైం గ్రేట్‌గా చెబుతున్నా. ఓ ప్లేయర్‌గా క్రిస్ గేల్, టీమ్‌పై చూపించిన ప్రభావం మరే ప్లేయర్ చూపించలేకపోయాడు...
 

Latest Videos


ఆర్‌సీబీ, క్రిస్ గేల్‌ని కొనుగోలు చేసిన తర్వాత అతను టీమ్‌ పర్ఫామెన్స్‌ని వేరే స్థాయికి తీసుకెళ్లాడు. పవర్ ప్లేలో తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతను టీమ్‌పైనే కాకుండా ఐపీఎల్‌పైన కూడా తన మార్కు వేశాడు... అలాంటి ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు అనిల్ కుంబ్లే...

Image credit: PBKS

ఐపీఎల్ 2009-10 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అనిల్ కుంబ్లే కోచింగ్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున కూడా ఆడిన క్రిస్ గేల్, 2021 ఐపీఎల్ తర్వాత ఆటకు దూరంగా ఉన్నాడు...

Kohli-Dhoni

టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీకి, అనిల్ కుంబ్లే మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే అనిల్ కుంబ్లే అర్ధాంతరంగా టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ కోపం వల్లే విరాట్ కోహ్లీని G.O.A.T అని ఒప్పుకోవడానికి కుంబ్లేకి మనసు రావడం లేదని అంటున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్..

click me!