భారత మహిళా జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ రమేష్ పవార్ ఎంపికయ్యాడు. టీమిండియా మహిళా జట్టు కోచ్‌గా పదవి నుంచి తప్పుకున్న తర్వాత డబ్ల్యూవీ రామన్, ‘స్టార్ కల్చర్’ గురించి వివరిస్తూ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి లేటర్ రాశాడు...

డబ్ల్యూవీ రామన్ కోచింగ్‌లో భారత మహిళా జట్టు 2020 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కి అర్హత సాధించి, రన్నరప్‌గా నిలిచింది. అయినా రామన్‌ను కాదని, రమేష్ పవార్‌ను కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది సీఓఏ...

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్‌కి పంపిన మెయిల్‌లో డబ్ల్యూవీ రామన్... ‘నేను ఎప్పుడూ వ్యక్తి కంటే జట్టుకే ప్రాధాన్యం ఇచ్చాను. సీనియర్ అయినంత మాత్రం ప్రాధాన్యం ఉండాలనే విధానాన్ని నేను అనుమతించలేదు...

కొందరు జట్టులో తమకి అధిక ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నారు. టీమిండియాలో స్టార్ కల్చర్ ఎక్కువైంది.... ’ అని చెప్పిన రామన్, తాను ఏ ప్లేయర్ గురించి మాట్లాడుతున్నది మాత్రం ఎక్కడా పేరు ప్రస్తావించలేదు...

యూఏఈలో జరిగిన వుమెన్స్ టీ20 ఛాలెంజ్ సమయంలో భారత మహిళా జట్టు ప్లేయర్లు అందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలో ట్రైయిల్‌బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్ నోవాస్ జట్ల ప్రాక్టీస్ కోసం తాను రోజుకి 9 గంటలు పనిచేసినట్టు తెలిపాడు రామన్...

బీసీసీఐకి రాసిన లేఖలో భారత మహిళా జట్టు బాగుపడాలంటే, సరైన రోడ్ మ్యాప్ నిర్మించడానికి సరైన వ్యక్తి ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ మాత్రమేనని విశ్వసించిన రామన్, ఇలాగే కొనసాగితే భారత జట్టు ఎప్పటికీ బాగుపడదని అభిప్రాయపడ్డాడు.

డబ్ల్యూవీ రామన్ రాసిన లేఖపై రచ్చ లేవడంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి దీనిపై ప్రస్తావించాడు భారత మాజీ కోచ్... ‘మహిళా జట్టు ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి ఇప్పుడు నాకు ఎలాంటి అధికారం లేదు. నా పీరియడ్ ముగిసింది...

‘మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, మీకూ సమయం వస్తుంది.’ ఇదిఓ వాచ్ కంపెనీ ట్యాగ్ లైన్. నా దృష్టిలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నా దగ్గర చాలా సమయం ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు డబ్ల్యూవీ రామన్.

భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన సౌరవ్ గంగూలీకి ఈ స్టార్ కల్చర్ గురించి తెలియనిది కాదు. గంగూలీకి ముందు జట్టులో సీనియర్లు, ప్రతీ విషయంలో తమకి ప్రాధాన్యం ఉండాలని కోరుకునేవాళ్లు...

నిజానికి టీమిండియా కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ నియమితులయ్యేదాకా టీమిండియాలో సౌరవ్ గంగూలీతో సహా చాలామంది సీనియర్లు స్టార్ స్టేటస్ అనుభవించేవాళ్లు.

కోచ్‌గా ఛాపెల్ ఎంట్రీ తర్వాత ఆ స్టార్లకు చుక్కలు కనిపించాయి, జట్టులో స్థానం ఉండాలంటే ఏ స్టార్ అయినా పర్ఫామ్ చేయాల్సిందేననే పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు మహిళా జట్టును గాడిలో పెట్టేందుకు రాహుల్ ద్రావిడ్ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాడు డబ్ల్యూవీ రామన్.