ఇదే బెస్ట్ ఐపీఎల్ 2021 టీమ్... కోహ్లీ, రోహిత్, ధోనీలకు నో ఛాన్స్, కెప్టెన్‌గా రిషబ్ పంత్...

First Published May 14, 2021, 4:46 PM IST

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడింది. 29 మ్యాచులు పూర్తికాగా, మిగిిన 31 మ్యాచుల పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సీజన్‌లో జరిగిన మ్యాచుల్లో యంగ్ ప్లేయర్లు అదరగొట్టారు. సీనియర్లు మాత్రం స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన మ్యాచుల పర్ఫామెన్స్ ఆధారంగా ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్... బెస్ట్ ఎలెవన్ టీమ్‌ను ఎంపిక చేశాడు... ఈ జట్టులో సీనియర్లకు చోటు దక్కకపోవడం విశేషం.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా బ్రాడ్ హగ్ ఎంపికచేసిన జట్టులో చోటు దక్కలేదు...
undefined
పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ఏకంగా నలుగురు ప్లేయర్లకు బ్రాడ్ హగ్ ప్రకటించిన బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో చోటు దక్కింది. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు.
undefined
సీజన్‌లో శిఖర్ ధావన్ 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలవగా పృథవీషా 308 పరుగులు చేశాడు. దాంతో ఈ ఇద్దరికీ తన జట్టులో చోటు కల్పించిన బ్రాడ్ హగ్, ఆర్‌సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి కూడా చోటు ఇవ్వలేదు.
undefined
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసి ఆకట్టుకున్న సంజూ శాంసన్‌కి వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా తన జట్టులో చోటు కల్పించిన బ్రాడ్ హగ్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు.
undefined
‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌కి మిడిల్ ఆర్డర్‌లో చోటు కల్పించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి బ్రాడ్ హగ్ జట్టులో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ప్లేయర్ ఏబీడీ కావడం విశేషం..
undefined
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లకు బ్రాడ్ హగ్ టీమ్‌లో ప్లేస్ దక్కింది...
undefined
వీరితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి, ముంబై ఇండియన్స్ నుంచి స్పిన్నర్ రాహుల్ చాహార్, జస్ప్రిత్ బుమ్రాలకు చోటు దక్కింది...
undefined
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లతో పాటు బౌలర్ ఆవేశ్ ఖాన్‌కి బ్రాడ్ హగ్‌ టీమ్‌లో ప్లేస్ దక్కింది...
undefined
బ్రాడ్ హగ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్: పృథ్వీషా, శిఖర్ ధావన్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, ఏబీ డివిల్లియర్స్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, రషీద్ ఖాన్, రాహుల్ చాహార్, ఆవేశ్ ఖాన్, బుమ్రా
undefined
click me!