ఆ రోజు పోలార్డ్‌ను తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ ఇష్టపడలేదు, నేనే ఒప్పించా... డ్వేన్ బ్రావో కామెంట్...

First Published May 14, 2021, 5:23 PM IST

కిరన్ పోలార్డ్... ముంబై ఇండియన్స్ జట్టులో అసలు సిసలైన మ్యాచ్ విన్నర్. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోలార్డ్ ఇన్నింగ్స్ చూసినవాళ్లెవ్వరైనా... ముంబై ఇండియన్స్ జట్టులో అతను ఎంత కీ ప్లేయర్ అనే విషయం అర్థం చేసుకుంటారు. అయితే పోలార్డ్‌ను తీసుకోవడానికి ముంబై ఇష్టపడనేలేదు.

రెండేళ్లు ముంబై ఇండియన్స్‌కి ఆడిన తర్వాత డ్వేన్ బ్రావోని రిప్లేస్‌మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా బ్రావో స్థానంలో డ్వేన్ స్మిత్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది ముంబై.
undefined
ఆ తర్వాత 2010 ఐపీఎల్‌లో రూ.3.42 కోట్లకు కిరన్ పోలార్డ్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. అయితే పోలార్డ్‌ను తీసుకునేందుకు ముంబై ఏ మాత్రం ఇష్టపడలేదట... ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు డ్వేన్ బ్రావో.
undefined
‘ముంబై ఇండియన్స్‌కి నా స్థానంలో రిప్లేస్‌మెంట్‌ కావాల్సి వచ్చినప్పుడు నేను కిరన్ పోలార్డ్ పేరు ప్రస్తావించాను. ఆ సమయంలో పోలార్డ్ ఓ క్లబ్ తరుపున ఆడుతున్నాడు.
undefined
పోలార్డ్ బిజీగా ఉండడంతో డ్వేన్ స్మిత్ పేరు చెప్పాను. అతను నా రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాతి ఏడాది ఛాంపియన్స్ లీగ్ సమయంలో రాహుల్ సంగ్వీని పిలిచి, పోలార్డ్ ఇక్కడే ఉన్నాడు, మాట్లాడమని చెప్పాను.
undefined
వెంటనే రాహుల్ సంగ్వీ, రాబిన్ సింగ్ ముంబై నుంచి హైదరాబాద్‌కి వచ్చారు. ఆ సమయంలో దాదాపు 2 లక్షల డాలర్ల (దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయలు)కాంట్రాక్ట్‌ను పోలార్డ్‌కి ఆఫర్ ఇచ్చింది ముంబై ఇండియన్స్..
undefined
పోలార్డ్‌ని పిలిచా.. లాబీలో ఇద్దరూ, అతన్ని కలిశారు. పోలార్డ్ కాంట్రాక్ట్ చూసి షాక్ అయ్యాడు. ట్రిడినాడ్ నుంచి వచ్చిన తనకి అంత మొత్తం అంటే బంపర్ లాటరీ తగిలినట్టే...
undefined
పోలార్డ్, నా వైపు తిరిగి... ‘డ్వేన్ ఇది నిజమేనా...’ అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు.... ఛాంపియన్స్ లీగ్‌లో పోలార్డ్ పర్ఫామెన్స్ తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది... ఇతను ఎవరు? అని అందరూ ఆరా తీయడం మొదలెట్టారు.
undefined
ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాతి ఏడాది మినీ వేలంలో పోలార్డ్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు పోలార్డ్ లేకుండా ముంబై ఇండియన్స్ జట్టును ఊహించడమే చాలా కష్టం...’ అంటూ చెప్పుకొచ్చాడు డ్వేన్ బ్రావో..
undefined
కిరన్ పోలార్డ్ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 171 మ్యాచులు ఆడి 3191 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
undefined
ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కి కొన్ని మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్ విన్యాసాలతో ఒంటిచేత్తో విజయాలు అందించాడు పోలార్డ్.
undefined
2014 మెగా వేలంలో కిరన్ పోలార్డ్‌ను అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్, 2018 ఐపీఎల్ వేలంలో రైట్ టు మ్యాచ్ వాడి తిరిగి తీసుకుంది... ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచిన పోలార్డ్... జట్టులో కీ ప్లేయర్‌గా మారాడు.
undefined
click me!