పదేళ్లుగా ఆడుతున్నా, నేను పనికి రానని అనుకున్నారేమో... టీ20 వరల్డ్‌కప్‌లో తన పేరు లేకపోవడంపై...

Published : Sep 10, 2021, 07:53 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. అయితే సౌతాఫ్రికా ప్రకటించిన జట్టులో సీనియర్లు ఫాఫ్ డుప్లిసిస్, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌లకు చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

PREV
111
పదేళ్లుగా ఆడుతున్నా, నేను పనికి రానని అనుకున్నారేమో... టీ20 వరల్డ్‌కప్‌లో తన పేరు లేకపోవడంపై...

కొన్నాళ్లుగా సరైన విజయాలు అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్న దక్షిణాఫ్రికా జట్టు... వన్డే, టీ20 ఫార్మాట్‌లో టీమ్‌కి అందుబాటులో ఉండేందుకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లిసిస్‌ను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకపోవడం ఫ్యాన్స్‌కి షాక్‌కి గురి చేసింది...   

211

తాజాగా తనకి టీ20 వరల్డ్‌కప్‌ ఆడే జట్టులో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్...

311

2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకున్న 42 ఏళ్ల ఇమ్రాన్ తాహీర్, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు...

411

‘టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ప్రకటించిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి, నేను చాలా బాధపడ్డాను. పోయిన ఏడాది నేను గ్రేమ్ స్మిత్‌తో మాట్లాడాను, టీ20 వరల్డ్‌కప్ ఆడాలనుకుంటున్నట్టు చెప్పాను...

511

స్మిత్ కూడా నాకు జట్టులో చోటు ఉంటుందని హామీ ఇచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌కి జట్టుని ప్రకటించే ముందు కూడా నేను అందుబాటులో ఉంటానని వాళ్లకి చెప్పాను...

611

టీ20 లీగుల్లో పాల్గొంటూ నా పర్ఫామెన్స్‌ సరిగ్గా ఉండేలా చాలా కష్టపడుతున్నా... నాతో పాటు ఏబీ డివిల్లియర్స్, డుప్లిసిస్ వంటి ప్లేయర్లను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేస్తానని గ్రేమ్ స్మిత్ నాకు హామీ ఇచ్చాడు...

711

కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ స్పందించలేదు. నా మెసేజ్‌లకు స్మిత్ కానీ, బ్రౌచర్ కానీ రిప్లై ఇవ్వడం లేదు. మార్క్ బ్రౌచర్ కోచ్ అయిన తర్వాత నన్ను ఇంతవరకూ కాంటాక్ట్ చేసింది లేదు..

811

నేను పదేళ్లుగా జాతీయ జట్టుకి క్రికెట్ ఆడుతున్నా. నన్ను అసలు పనికి రాని వాడిగా భావించి, పక్కన పెట్టేయడం చాలా బాధగా అనిపించింది... కనీస గౌరవం ఇవ్వాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు ఇమ్రాన్ తాహీర్...

911

ఐపీఎల్ 2021 ఫేజ్ 1 ఆరంభానికి ముందు ఏబీ డివిల్లియర్స్‌ను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు... అయితే ఏబీడీ దానికి అంగీకరించలేదు..

1011

తన కారణంగా సౌతాఫ్రికా జట్టులోని ఓ యువ క్రికెటర్ చోటు కోల్పోవడం తనకి ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే కమ్‌బ్యాక్ ఆలోచనలు మానుకున్నానంటూ కామెంట్ చేశాడు...

1111

ఈ సంఘటన తర్వాత అతన్ని మళ్లీ పిలవాలనే ఆలోచనను మానుకున్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు... మంచి ఫామ్‌లో ఉన్న డుప్లిసిస్, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌లను కూడా పట్టించుకోకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

click me!

Recommended Stories