India Vs Srilanka: భారత జట్టును గాయాల బెడద వేధిస్తున్నది. కీలక ఆటగాళ్లంతా వరుసగా గాయాల బారీన పడుతున్నారు. ఇప్పటికే దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ లు గాయపడగా తాజాగా...
టీమిండియా ఏ ముహుర్తాన లంకతో సిరీస్ ప్రారంభించిందో గానీ రోహిత్ సేనకు ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో ఏదీ కలిసిరావడం లేదు. సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ ఆటగాళ్లు దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ లు గాయాల బారీన పడ్డారు.
29
రెండో టీ20కి ముందు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మణికట్టు గాయంతో సిరీస్ నుంచి దూరమైన విషయం తెలిసిందే.
39
ఇక ఇప్పుడు టీమిండియాకు మరో షాక్ తగిలింది. భారత జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. రెండో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా.. కిషన్ గాయపడ్డాడు.
49
లంక బౌలర్ లాహిరు కుమార వేసిన నాలుగో ఓవర్లో కిషన్ కు గాయమైంది. 147.6 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన లాహిరు కుమార.. బౌన్సర్ వేశాడు. అయితే దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్ కు బంతి బలంగా తాకింది.
59
దీంతో క్రీజు నుంచి వెళ్లిన కిషన్.. వెంటనే పక్కకువెళ్లి హెల్మెట్ తీసి తలను చూసుకున్నాడు. అక్కడే ఉన్న ఫిజియో వచ్చి ఇషాన్ ను పరిశీలించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువ కాకపోవడంతో కిషన్ మ్యాచును కొనసాగించాడు. కాగా 15 బంతుల్లో రెండు బౌండరీలు సాధించి 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. చివరికి లాహిరు బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు.
69
మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ.. కిషన్ ను హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా ఆస్పత్రికి తరలించింది. ఇషాన్ తలకు గాయమైందా..? లేదా..? దాని తీవ్రత ఎంత..? అన్న కోణంలో బీసీసీఐ వైద్య బృందం పరీక్షలు చేస్తున్నది.
79
ఆదివారం కిషన్ వైద్య పరీక్షలకు సంబంధించిన ఫలితం ఆదివారం రానున్నది. ఇప్పటికైతే కిషన్ బాగానే ఉన్నాడని, అతడు వైద్యులు పరిశీలనలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది.
89
ఈ నేపథ్యంలో కిషన్ మూడో టీ20 ఆడేది అనుమానంగానే ఉంది. ఒకవేళ అతడు ఆడకుంటే నేటి టీ20లో రోహిత్ తో ఇన్నింగ్స్ ఎవరు ఓపెన్ చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.
99
కిషన్ తో పాటు.. శ్రీలంక వికెట్ కీపర్ దినేశ్ చండిమాల్ కూడా గాయపడ్డాడు. భారత్ తో ఇన్నింగ్స్ సందర్బంగా.. కీపింగ్ చేస్తుండగా అతడికి గాయమైంది. కిషన్, చండిమాల్ ఇద్దరూ కంగ్రా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.