ఇలాంటప్పుడే విరాట్ విలువేంటో తెలుస్తుంది... కెప్టెన్‌గా రోహిత్ శర్మపై...

Published : Feb 26, 2022, 09:27 PM IST

టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. అయితే బ్యాటుతో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

PREV
112
ఇలాంటప్పుడే విరాట్ విలువేంటో తెలుస్తుంది... కెప్టెన్‌గా రోహిత్ శర్మపై...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 3 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 53 యావరేజ్‌తో 159 పరుగులు చేశాడు రోహిత్ శర్మ...

212

అయితే ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి ముందు గాయపడి, సఫారీలతో వన్డే, టెస్టు సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ... రీఎంట్రీ తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

312

విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నా, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో కలిపి 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో కలిపి 78 పరుగులే చేశాడు రోహిత్ శర్మ...

412

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన రోహిత్ శర్మ, 3 మ్యాచుల్లో కలిపి 22 యావరేజ్‌తో 66 పరుగులే చేశాడు...

512

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 44 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రోహిత్ శర్మ, రెండో మ్యాచ్‌లో 185 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు...

612

దుస్మంత ఛమీరా బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుట్ కావడం టీ20ల్లో ఇది ఐదోసారి. టీ20ల్లో రోహిత్‌ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛమీరా...

712

టీ20ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం రోహిత్ శర్మకు ఇది 39వ సారి. భారత జట్టు తరుపున అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు రోహిత్ శర్మ...

812

టీ20ల్లో 180+ పరుగుల లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ 154 స్ట్రైయిక్ రేటుతో 59 యావరేజ్‌తో 533 పరుగులు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ 37 యావరేజ్‌తో 367 పరుగులు చేశాడు...

912

భారీ లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ త్వరగా అవుట్ కావడంతో హిట్ మ్యాన్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు...

1012

విదేశాల్లో ఫెయిల్ అయినా, స్వదేశంలో మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ... కెప్టెన్సీ కారణంగా శ్రీలంక వంటి ఫామ్‌లో లేని జట్టుపై కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు...

1112

రెండేళ్లుగా ఫామ్‌లో లేకపోయినా విరాట్ కోహ్లీ, కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే టీమిండియా తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు...

1212

కెప్టెన్సీ భారాన్ని మోస్తూ, రన్ మెషిన్‌లా పరుగులు చేయడం కేవలం కోహ్లీకే సాధ్యమని.. విరాట్ విలువేంటో టీమిండియా ఫ్యాన్స్‌కి తెలిసి వచ్చి ఉంటుందని అంటున్నారు మాజీ సారథి అభిమానులు... ఈ విమర్శలకు ఆఖరి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన బ్యాటుతోనే సమాధానం చెబుతాడని అంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories