ఆ ఇద్దరికీ పోటీ వస్తున్న రిషి ధావన్... హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్‌ పర్ఫామెన్స్‌తో పాండ్యా, అయ్యర్‌లకు...

First Published Dec 27, 2021, 3:20 PM IST

ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌లో ఆడితే వచ్చే క్రేజ్, గుర్తింపు... దేశవాళీ టోర్నీల్లో ఎన్ని మ్యాచులు ఆడినా రాదు. అందుకే హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రిషి ధావన్ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలీదు...

సయ్యద్ ముస్తాక్ ఆలీ అదరగొట్టిన రిషి ధావన్, విజయ్ హాజారే ట్రోఫీ గెలిచి హిమాచల్ ప్రదేశ్ జట్టుకి కెప్టెన్‌గా మొట్టమొదటి దేశవాళీ టోర్నీ అందించాడు... 

1990 ఫిబ్రవరి 19న హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఏరియాలో జన్మించిన రిషి ధావన్, దేశవాళీ టోర్నీల్లో పర్పామెన్స్ కారణంగా టీమిండియా తరుపున  ఆరంగ్రేటం చేసి మూడు వన్డే మ్యాచులు, ఓ టీ20 కూడా ఆడాడు...

2008 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ధావన్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2013లో రిషి ధావన్, ముంబై ఇండియన్స్ తరుపున కూడా ఆడాడు...

2014 ఐపీఎల్ వేలంలో రిషి ధావన్‌ను ఏకంగా రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 2017 వేలంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు 55 లక్షలకు సొంతం చేసుకుంది...

అయితే ఐపీఎల్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రిషీ ధావన్, ఈ ఏడాది దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా అదరగొడుతున్నాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆల్‌రౌండ్ పర్పామెన్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకర్షించాడు ధావన్...

విజయ్ హాజారే ట్రోఫీలో 7 మ్యాచుల్లో 69.33 సగటుతో 416 పరుగులు చేశాడు రిషీ ధావన్. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్‌లో 5.95 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు తీశాడు ధావన్...

అంతకుముందు సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో 117 పరుగులు చేసి, 14 వికెట్లు తీసిన రిషి ధావన్‌కి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...

ఒకవేళ రిషి ధావన్‌కి టీమిండియా సెలక్టర్ల నుంచి మరోసారి పిలుపు వస్తే, భారత ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్‌లకు పోటీ పెరగనుంది...

click me!