ధోనీ అలా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు, టీమ్ మొత్తం షాక్ అయ్యింది... మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

First Published Dec 27, 2021, 1:44 PM IST

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి సీనియర్లు టెస్టుల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు వీలుగా వైట్‌ బాల్ క్రికెట్‌ నుంచి ముందుగా తప్పుకుంటే... ఎమ్మెస్ ధోనీ మాత్రం వారికి భిన్నంగా చేశాడు. వన్డే, టీ20ల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు టెస్టుల నుంచి ఆరేళ్ల ముందే తప్పుకున్నాడు  ధోనీ...

ఆస్ట్రేలియా టూర్‌లో మెల్‌బోర్న్‌లో క్రికెట్ మ్యాచ్ ఓడిన తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని అర్ధాంతరంగా నిర్ణయం తీసుకున్నాడు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

మాహీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం... టీమ్ సభ్యులనే కాదు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కూడా షాక్‌కి గురి చేసిందట. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు అప్పటి టీమ్ డైరెక్టర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

‘మాహీ అప్పటికే 90 టెస్టులు ఆడాడు. మరో 10 మ్యాచులు ఆడితే 100 టెస్టులు ఆడిన ఘనత కూడా దక్కేది. అలాంటి రేర్ ఫీట్ ఎవరు మాత్రం కోరుకోరు. అయితే మాహీ సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడు...

నా దగ్గరకి వచ్చి బాయ్స్‌కి నేను ఓ విషయం చెప్పాలి అన్నాడు. నేను సరేనని అన్నాను. నేను టెస్టు మ్యాచ్ గురించి ఏమైనా చెప్పబోతున్నాడేమోనని అనుకున్నా...

అయితే అతను డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే ప్లేయర్ల అందరి ముఖాలు చూశాడు. తర్వాత టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. చాలామంది ముఖాలు, మాహీ ప్రకటన విని షాక్‌కి గురైనట్టు కనిపించాయి...

మాహీ అంతే, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం. ధోనీ తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేబడతాడని నాకు ముందుగానే తెలుసు. మాహీకి కోహ్లీలో ఉన్న లీడర్ మీద చాలా నమ్మకం ఉంది...

మాహీ టెస్టుల నుంచి తప్పుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు కనిపించాడు. తన శరీరం గురించి, తన ఫిట్‌నెస్ గురించి అతనికి పూర్తి అవగాహన ఉంది...

వైట్ బాల్ క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగాలంటే టెస్టుల్లో నుంచి తప్పుకోవడమే తెలివైన ఎత్తుగడ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ తన అవసరం ఎక్కువగా ఉందో మాహీ గుర్తించాడు...

శరీరం సహకరించనప్పుడు వేరే ఆలోచనలు ఉండకూడదు. అతను కావాలంటే మరో 10 కాదు, 50 మ్యాచులు ఆడొచ్చు... కానీ సరైన టైంలో తప్పుకోవాలని అనుకున్నాడు, తప్పుకున్నాడు... ’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

తన కెరీర్‌లో 90 టెస్టు మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు (ఓ డబుల్ సెంచరీ), 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

2014లో టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ వరకూ భారత వన్డే, టీ20 టీమ్‌లో సభ్యుడిగా కొనసాగాడు. 2019 వన్డే వరల్డ్‌ కప్ తర్వాత టీమిండియాకి దూరమైన మాహీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

click me!