సిరాజ్ లో అది బాగా పెరుగుతుంది.. అతడ్ని ఆపడం ఎవరితరమూ కాదు.. హైదరాబాదీపై మాజీ పేసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Dec 6, 2021, 6:56 PM IST

Mohammed Siraj: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ పై భారత మాజీ స్పీడ్ స్టర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంతో పోలిస్తే  సిరాజ్ మెరుగయ్యాడన్న జహీర్.. అతడి బలాబలాలపై మాట్లాడాడు.

ముంబై టెస్టులో న్యూజిలాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో దెబ్బ తీయడంలో టీమిండియా పేసర్  మహ్మద్ సిరాజ్ ది కీలక పాత్ర. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కివీస్ 62 పరుగులకే ఆలౌట్ కాగా.. అందులో  సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. 

కాగా.. తాజాగా సిరాజ్ పై భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు గతంలో లేనంత భరోసాతో కనిపిస్తున్నాడని, సిరాజ్ ఇలాగే కొనసాగితే ఇక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని కామెంట్స్ చేశాడు. 

ముంబై టెస్టు అనంతరం ఓ  స్పోర్ట్స్ ఛానెల్ తో మాట్లాడిన జహీర్ ఖాన్.. ‘సిరాజ్ రోజురోజుకూ ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నాడు. మునుపెన్నడూ లేనంత భరోసాగా అతడు కనిపిస్తున్నాడు... 

సిరాజ్ ను చూసినప్పుడు అతడు తన బలాబలాలెంటో తెలుసుకున్నట్టు అనిపిస్తున్నది. అతడు ఏకంగా స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసురుతున్నాడు. అదే అతడి బలం. బంతులు ఎలా వేస్తే తనకు వికెట్లు దక్కుతాయనే విషయంపై సిరాజ్ అవగాహన పెంచుకున్నాడు..’ అని జహీర్ అన్నాడు. 

సిరాజ్ ను  తాను ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్ గానే చూస్తానని జహీర్ అన్నాడు. ‘జట్టులో సిరాజ్ వంటి ఆటగాడు ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు తేలిక అవుతాయి. ఎందుకంటే.. మీరు మీ ప్రధాన బౌలర్ (బుమ్రా ను ఉద్దేశిస్తూ) కు  విశ్రాంతి ఇచ్చినప్పుడు సిరాజ్ వంటి ఆటగాళ్లను వాడుకోవచ్చు. ఒకవేళ బుమ్రాను వ్యూహాత్మకంగా వాడాలనుకుంటే.. అటువంటి  సందర్భాలలో  సిరాజ్ మీకు గొప్పగా సహకరిస్తాడు..’ అని  జహీర్ తెలిపాడు. 

ఇక రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాస్ టేలర్ వికెట్ తీయడంపై సిరాజ్ స్పందించాడు. ఏ బౌలర్ కైనా అది  డ్రీమ్ డెలివరీ అని  అన్నాడు. సిరాజ్ మాట్లాడుతూ.. ‘నాకు గాయమై కోలుకున్నాక నేను  ఒక్క వికెట్  పెట్టుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. దాంతోనే నేను స్వింగ్ రాబట్టడం ప్రాక్టీస్ చేశాను. 

నా దృష్టంతా దాని మీదే నిలిపాను. ఇక నాకు టెస్టు మ్యాచ్ లో అవకాశం రాగానే అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగించాను. స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకుని విసిరితే బ్యాటర్లకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక ప్రాంతాన్నే టార్గెట్ గా చేసుకుని అక్కడే బాల్స్ వేశాను. ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ దాడి చేస్తే బ్యాటర్లు ఆ డెలివరీలను వదిలివేస్తారు. మనం దాన్నుంచి స్వింగ్ రాబడితే సక్సెస్ అయినట్టే..’ అని తెలిపాడు. రాస్ టేలర్ ను సిరాజ్ ఇలాగే  ఔట్ చేశాడు. 

రెండేండ్ల క్రితమే అంతర్జాతీయ కెరీర్ (టెస్టులలో) ప్రారంభించిన సిరాజ్.. ఇప్పటివరకు 10 టెస్టులలో 33 వికెట్లు తీశాడు. ఒక వన్డే, నాలుగు టీ20లు ఆడిన సిరాజ్.. ఇంకా  ఆ ఫార్మాట్లలో స్థానం సుస్థిరం చేసుకోలేదు. 

click me!