లంకపై 24 ఏళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకున్న టీమిండియా.. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో...

First Published | Sep 17, 2023, 5:56 PM IST

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ సెన్సేషనల్ స్పెల్‌ కారణంగా శ్రీలంక 50 పరుగులకే చాప చుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ మెండిస్ (17 పరుగులు), దుసాన్ హేమంత (13) మాత్రమే  డబుల్ డిజిట్ స్కోరు చేశారు..

లంక ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఓ జట్టుకి ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు టీమిండియా, శ్రీలంకపైనే 54 పరుగులు చేసింది..
 

షార్జాలో జరిగిన 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగులు చేసింది. లంక కెప్టెన్ సనత్ జయసూర్య 189 పరుగులు చేయగా రస్సెల్ ఆర్నాల్డ్ 52 పరుగులు చేశాడు. 
 

Latest Videos


ఈ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.3 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాబిన్ సింగ్ 11 పరుగులు మినహా మిగిలిన భారత బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు..

chaminda vaas

కెప్టెన్ గంగూలీ 3, సచిన్ 5, యువరాజ్సింగ్ 3, వినోద్ కాంబ్లీ 3, హేమాంగ్ బదానీ 9, రాబిన్ సింగ్ 11, విజయ్ దహియా 4, అజిత్ అగార్కర్ 2, జహీర్ ఖాన్ 1 పరుగు చేసి అవుట్ కాగా వెంకటేశ్ ప్రసాద్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

చమిందా వాస్ 5 వికెట్లు తీయగా ముత్తయ్య మురళీ ధరన్ 6 ఓవర్లలో 3 మెయిడిన్లతో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.  ఇది జరిగిన 23 ఏళ్లకు శ్రీలంకపై రివెంజ్ తీర్చుకుంది భారత జట్టు..

భారత్‌పై వన్డేల్లో ఓ జట్టుకి ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2014లో బంగ్లాదేశ్ 58 పరుగులకు ఆలౌట్ కాగా 2005లో జింబాబ్వే 65 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా సగం ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేస్తే, లంక ఇన్నింగ్స్ 15.2 ఓవర్లలోనే ముగిసింది. 
 

click me!