మహ్మద్ సిరాజ్ దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్... సెన్సేషనల్ స్పెల్‌తో హైదరాబాదీ...

First Published | Sep 17, 2023, 5:36 PM IST

ఆసియా కప్ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకనే ఫెవరెట్. సొంత మైదానంలో, సొంత జనాల మధ్య ఫైనల్ ఆడుతున్న లంక, టాస్ కూడా గెలిచింది. అయితే హైదరాబాదీ మియ్యా మహ్మద్ సిరాజ్ ఒకే ఒక్క ఓవర్‌లో ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించేశాడు..
 

mohammed siraj

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మెయిడిన్ వేసిన మహ్మద్ సిరాజ్, నాలుగో ఓవర్ మొదటి బంతికి నిశ్శంకని అవుట్ చేశాడు. అయితే నిశ్శంక వికెట్ క్రెడిట్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జడేజాకి దక్కాలి. ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు..

మూడో బంతికి సధీర సమరవిక్రమ,ఆ తర్వాతి బంతికి చరిత్ అసలంకను అవుట్ చేశాడు మహ్మద్ సిరాజ్. హ్యాట్రిక్ బంతికి ధనంజయ డి సిల్వ ఫోర్ బాదాడు. ఈ ఫోర్ ఆపేందుకు స్వయంగా బౌండరీ లైన్ వరకూ పరుగెత్తూతూ వెళ్లాడు సిరాజ్..
 


Siraj


ఆ ఓవర్‌లో ఆఖరి బంతికి ధనంజయ అవుట్ అయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సమయానికి ఓ మెయిడిన్‌తో 4 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ సిరాజ్. 

సిరాజ్ తర్వాతి ఓవర్‌లో లంక కెప్టెన్ దసున్ శనక కూడా డకౌట్ అయ్యాడు. కేవలం 16 బంతుల్లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, అత్యంత వేగంగా వన్డేల్లో 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు చమిందావాస్, బంగ్లాదేశ్‌పై 16 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. సిరాజ్ ఆ రికార్డును సమం చేశాడు. 

2002 తర్వాత 10 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ సిరాజ్. ఇప్పటిదాకా శ్రీనాథ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, సిరాజ్ నాలుగేసి వికెట్లు తీశారు..
 

వన్డే ఆసియా కప్ టోర్నీల్లో 6 వికెట్లు తీసిన రెండో బౌలర్ మహ్మద్ సిరాజ్. ఇంతకుముందు 2008లో లంక స్పిన్నర్ అజంతా మెండీస్, భారత జట్టుపై 6 వికెట్లు తీశాడు..

Mohammed Siraj

వన్డేల్లో టీమిండియా తరుపున నాలుగో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు సిరాజ్ (6/21). ఇంతకుముందు స్టువర్ట్ బిన్నీ, బంగ్లాపై 6/4 నమోదు చేసి టాప్‌లో ఉంటే, అనిల్ కుంబ్లే 6/12,  జస్ప్రిత్ బుమ్రా 6/19 తీసి సిరాజ్ కంటే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.. 
 

Latest Videos

click me!