13 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ధోనీ కెప్టెన్సీలో ఆడి..

Chinthakindhi Ramu | Published : Sep 17, 2023 4:12 PM
Google News Follow Us

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ 2023 టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరింది. మినీ వరల్డ్ కప్‌గా పిలవబడే ఆసియా కప్ టైటిల్ గెలిస్తే, స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ముందు టీమ్‌లో డబుల్ జోష్ నిండుతుంది.. ఆసియా కప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడడం ఇది మూడోసారి మాత్రమే..

18
13 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ధోనీ కెప్టెన్సీలో ఆడి..
Kohli-Rohit hug

2010లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 81 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది..

28

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ 15, దినేశ్ కార్తీక్ 66, విరాట్ కోహ్లీ 28, ధోనీ 38, రోహిత్ శర్మ 41, రైనా 29, జడేజా 25 పరుగులు చేశారు..
 

38

ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 187 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దిల్షాన్, మాథ్యూస్ డకౌట్ అయ్యారు. చమర కపుగెదర 55 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆశీష్ నెహ్రా 4 వికెట్లు తీశాడు. జడేజా, జహీర్ ఖాన్‌ రెండేసి వికెట్లు తీశారు..

Related Articles

48
Image credit: PTI

ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ, 16 పరుగులు ఇచ్చాడు. అప్పటికి స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఉన్న రోహిత్ శర్మ మాత్రం 2010 ఆసియా కప్ ఫైనల్‌లో బౌలింగ్ చేయకపోవడం విశేషం..
 

58

ఆ తర్వాత 2012, 2014 ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. 2016లో బంగ్లాతో ఫైనల్ ఆడింది టీమిండియా. అయితే ఇది టీ20 ఫార్మాట్‌లో జరిగిన మొట్టమొదటి ఆసియా కప్ టోర్నీ..

68

2016 ఆసియా కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ 1 పరుగుకే అవుటైనా శిఖర్ ధావన్ 60 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 41, ఎమ్మెస్ ధోనీ 20 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు..

78

ధోనీ కెప్టెన్సీలో టీ20, వన్డే ఫార్మాట్లలో కలిసి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 13 ఏళ్ల తర్వాత వన్డే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారు. 2018 ఆసియా కప్ టైటిల్‌ని టీమిండియా కైవసం చేసుకుంది..

88
Asia Cup 2018

అయితే ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడలేదు. వివాహం తర్వాత విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ 2018 టోర్నీ ఆడిన భారత జట్టు, ఏడో టైటిల్ గెలిచింది..

Read more Photos on
Recommended Photos