మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న హార్ధిక్ పాండ్యా... కొడుకు పుట్టిన ఇన్నేళ్లకు టీమిండియా కెప్టెన్‌కి...

Published : Feb 12, 2023, 06:44 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ హార్ధిక్ పాండ్యా లైఫ్‌ని మొత్తం మార్చేసింది. ఏ మాత్రం అంచనాలు లేని గుజరాత్ టైటాన్స్‌ని టైటిల్ విజేతగా నిలిపిన హార్ధిక్ పాండ్యా, టీమిండియా టీ20 కెప్టెన్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా హార్ధిక్ పాండ్యా మళ్లీ పెళ్లికి రెఢీ అయ్యాడు...

PREV
17
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న హార్ధిక్ పాండ్యా... కొడుకు పుట్టిన ఇన్నేళ్లకు టీమిండియా కెప్టెన్‌కి...

ఆలీ హీరోగా వచ్చిన ‘యమలీల’ సినిమాలో తోట రాముడు (తనికెళ్ల భరణి) ‘నా చెల్లికి జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ’ అని రాస్తాడు. చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి ఏంట్రా అని చదివిన వాళ్లు తిడతారు కానీ హార్ధిక్ పాండ్యాకి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చినట్టుంది... అందుకే రెండోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు...

27

రెండోసారి పెళ్లి చేసుకుంటున్నాడు కానీ రెండో పెళ్లి కాదండోయ్. అప్పుడెప్పుడో 2020లోపెళ్లి చేసుకున్న తన గర్ల్‌ఫ్రెండ్, భార్య, బాలీవుడ్ నటీమణి నటాశా స్టాంకోవిక్‌ని ఇంకోసారి పెళ్లాడబోతున్నాడు హార్ధిక్ పాండ్యా...
 

37

శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీ20 సిరీస్‌లు గెలిచిన హార్దిక్ పాండ్యా, ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసే వరకూ పాండ్యా, టీమిండియావైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ గ్యాప్‌లో వాలెంటైన్స్ డేకి తన భార్యకి ఏదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని స్పెషల్‌గా ప్లాన్ చేశాడు హార్ధిక్ పాండ్యా..

47

వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14)న ఉదయ్‌పూర్‌లో నటాశాని క్రైస్తవ సంప్రదాయంలో ‘వైట్ మ్యారేజ్’ చేసుకోబోతున్నాడు హార్ధిక్ పాండ్యా. జనవరి 2020లో నటాశాకి ప్రపోజ్ చేసి, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా...

57

పెళ్లికి ముందే హానీమూన్‌కి వెళ్లొచ్చిన ఈ జంట, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. సైలెంట్‌గా ఎవ్వరికీ తెలియకుండా ముంబై కోర్టులో అప్పుడు నటాశాని పెళ్లాడిన హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఘనంగా రెండోసారి వివాహం చేసుకోబోతున్నాడు..
 

67

రెండో పెళ్లి అని అలా ఇలా తీసి పాడేయకండి. ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే హార్ధిక్ పాండ్యా - నటాశాల వివాహం 16వ తారీఖు వరకూ ఘనంగా జరగనుంది. హల్దీ , మెహెందీ, సంగీత్.. ఇలా అన్ని రకాల కార్యక్రమాలతో అతిథుల మధ్య అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరగనుంది..

77

డబ్బున్నోడు ఎన్ని డాబులైనా పడతాడు... మళ్లీ పెళ్లికి చేసే ఆ వృథా ఖర్చు ఏదో పేదలకు సాయం చేసేందుకు వాడొచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. అయితే లక్షలు విలువ చేసే బట్టలు కొంటూ, మరికొన్ని లక్షల ఖరీదైన వాచీలు, నగలు వాడే పాండ్యా బ్రదర్స్‌కి ఇది ఓ లెక్కా... అని కొట్టిపారేస్తున్నారు మరికొందరు.. 

click me!

Recommended Stories