కోలుకున్న శ్రేయాస్ అయ్యర్! రీఎంట్రీ కన్ఫార్మ్... సూర్య భాయ్ ఇక రిజర్వు బెంచ్‌కేనా...

Published : Feb 12, 2023, 05:25 PM IST

సూర్యకుమార్ యాదవ్... టీ20ల్లో నెం.1 బ్యాటర్. వన్డేల్లో చెప్పుకోనుంతగా సక్సెస్ కాలేకపోయాడు సూర్య. అయితే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి, త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారాలని కలలు కన్నాడు సూర్యకుమార్ యాదవ్. నాగ్‌పూర్ టెస్టులో టెస్టు ఆరంగ్రేటం చేసిన సూర్య, 20 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 8 పరుగులు చేశాడు..  

PREV
18
కోలుకున్న శ్రేయాస్ అయ్యర్! రీఎంట్రీ కన్ఫార్మ్... సూర్య భాయ్ ఇక రిజర్వు బెంచ్‌కేనా...

వన్డేల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో ఉంటాడా? అనేది అనుమానమే. అయితే సూర్యకి వన్డేల్లో వరుస అవకాశాలు ఇవ్వడం కోసం శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేసే ప్రయత్నాలు జరిగాయని టాక్ వినిపించింది...
 

28
Image credit: Getty

గాయంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ ఆడలేదు. అయితే అయ్యర్ గాయపడడంతో దక్కిన అవకాశాలను సూర్య భాయ్ సరిగా వాడుకోలేకపోయాడు. వన్డే సిరీస్‌లో ఫెయిల్ అయిన సూర్య, తొలి టెస్టులో 8 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
 

38

సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ  షా, వీరేంద్ర సెహ్వాగ్ మాదిరిగా డాషింగ్ బ్యాట్స్‌మెన్. టెస్టుల్లో కూడా అతని నుంచి ఇలాంటి బ్యాటింగే ఆశించింది టీమిండియా. అయితే వన్డేల్లో ఫెయిల్ అయ్యాననే భయమో లేక టెస్టుల్లో డిఫెన్స్ కూడా ఆడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు నిర్మించగలనని నిరూపించుకోవాలని భావించాడో కానీ తొలి టెస్టులో సూర్య తన మార్కు వేయడంలో ఫ్లాప్ అయ్యాడు...

48
Image credit: Getty

తొలి టెస్టుకి దూరమైన శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఫిబ్రవరి 13న టీమిండియాతో కలిసే అయ్యర్, ఢిల్లీలో జరిగే రెండో టెస్టు ఆడడం ఖాయం. తొలి టెస్టులో సూర్య కనీసం 40-50 పరుగులు చేసినా శ్రేయాస్ అయ్యర్‌ని రెండు మూడు మ్యాచులు రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టినా పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు...
 

58
Image credit: Getty

అయితే తొలి టెస్టులో ఫెయిల్ అయినా సూర్యకుమార్ యాదవ్‌కి మరో అవకాశం ఇచ్చి, శ్రేయాస్ అయ్యర్‌ని పక్కనబెడితే కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది... ఇద్దరినీ ఆడించే అవకాశం అసలే లేదు.. 

68

సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారాలను తప్పించే అవకాశం లేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, షమీ తమ ప్లేసుల్లో ఫిక్స్ అయిపోయారు. ఇక శ్రేయాస్ అయ్యర్‌ని జట్టులోకి తీసుకొచ్చి సూర్యను ఆడించాలంటే వికెట్ కీపింగ్ బ్యాటర్‌గానే ఆడించాలి. సూర్యకి వికెట్ కీపింగ్ రాదు...
 

78
Image credit: PTI

ఇప్పటికే తొలి టెస్టులో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శుబ్‌మన్ గిల్ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, రాహుల్‌ని ఆడించడం కరెక్ట్ కాదని రోహిత్ శర్మను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, అభిమానులు...
 

88
Image credit: PTI

ఇప్పుడు ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, సూర్యకుమార్ యాదవ్‌కి మరో ఛాన్స్ ఇస్తే.. ఇదే సీన్ రిపీట్ అవుతుంది. 32 ఏళ్ల వయసులో టెస్టుల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్య భాయ్, సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో అవకాశం రావాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.. 

click me!

Recommended Stories