స్వదేశంలో చిరుత పులులే, మరి విదేశాల్లో మాటేమిటి... రోహిత్ సేన విజయాలపై...

First Published Feb 21, 2022, 1:25 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఘోర పరాభవం తర్వాత భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే ఇప్పటిదాకా భారత జట్టు కొత్త సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీకి అసలైన పరీక్ష ఎదురుకాలేదు...
 

సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టు విజయం తర్వాత వరుసగా ఐదు పరాజయాల తర్వాత విండీస్‌ను స్వదేశంలో చిత్తు చేసింది భారత జట్టు...

స్వదేశంలో చిరుత పులుల్లా చెలరేగిపోయే భారత క్రికెటర్లు, న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసి... టెస్టు సిరీస్‌నూ 1-0 తేడాతో గెలిచేశారు...

ఆ తర్వాత వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌ల్లో చిత్తు చేసి, రెండింట్లోనూ వైట్ వాష్ సొంతం చేసుకుంది రోహిత్ కెప్టెన్సీలోని భారత జట్టు...

ఈ విజయాలతో భారత జట్టుపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్ 2022 మనదేనంటూ తెగ హడావుడి మొదలెట్టేస్తున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్...

అయితే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు ఈ రేంజ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టగలుగుతుందా?...

సఫారీ టూర్‌లో రోహిత్ శర్మ అందుబాటులో ఉండి, వన్డే సిరీస్‌లో, విరాట్ కోహ్లీ గైర్హజరీలో టెస్టు జట్టును నడిపించి ఉంటే... అతని కెప్టెన్సీలోని అసలైన మ్యాజిక్ బయటికి వచ్చి ఉండేది...

బ్యాటర్‌గా రోహిత్ శర్మకు స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉంది. అయితే విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో రోహిత్ శర్మ నుంచి బ్యాటుతో అనుకున్న రిజల్ట్ రాలేదు...
 

వన్డే సిరీస్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ, టీ20 సిరీస్‌లో అయితే మూడు మ్యాచుల్లో కలిపి 66 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు రోహిత్...

స్వదేశంలో 80+ యావరేజ్ ఉన్న రోహిత్ శర్మ, ఇప్పుడు ఇక్కడే ఫెయిల్ అయితే, విదేశాల్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 27+ మాత్రమే...

భారత బ్యాటర్లకు, బౌలర్లకు బాగా అలవాటున్న ఇక్కడి పిచ్‌ల మీద మనవాళ్లు మంచి పర్ఫామెన్స్ ఇవ్వడం పెద్ద విశేషమేమీ కాదు... అసలైన ఛాలెంజ్ విదేశాల్లోనే మొదలవుతుంది...

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత బ్యాటర్లు, బౌలర్లు... ఇప్పుడు ఇచ్చిన పర్ఫామెన్స్‌ని రిపీట్ చేయగలుగుతారా? అనేది చాలా పెద్ద ప్రశ్నే...

అదీకాకుండా రోహిత్ శర్మ ఇప్పటిదాకా స్వదేశంలో ఎదుర్కొన్న రెండు జట్లూ (న్యూజిలాండ్, వెస్టిండీస్) ఫారిన్ పిచ్‌లపై ఇబ్బంది పడేవే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లను ఎదుర్కునే అవకాశం ఇంకా రాలేదు.

సఫారీ టూర్‌లో ఆడిన వన్డే సిరీస్‌లో ఆడిన జట్టులో ఉన్న మెజారిటీ ప్లేయర్లు, విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆడారు. అక్కడ, ఇక్కడా మారింది రోహిత్ కెప్టెన్సీ, స్వదేశీ పిచ్‌ పరిస్థితులే...

రాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా వన్డే, టీ20 సిరీసుల్లో విజయాలు సాధించి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు...

అయితే ఇక్కడ జరిగిన సిరీసుల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్... పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో విఫలమై భారత జట్టు ఓడిపోవడానికి కారణమయ్యారు...

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇలాంటి సీన్లు రిపీట్ కాకుంటే చాలని కోరుకుంటున్నారు రోహిత్ శర్మ, టీమిండియా అభిమానులు...

click me!