IPL Media Rights: ఈ నెలాఖరున ఐపీఎల్ మీడియా హక్కులకు టెండర్..? పోటీలో అగ్రశ్రేణి సంస్థలు

Published : Feb 21, 2022, 12:01 PM IST

IPL Media Rights Tender: ప్రపంచంలో ఫుట్బాల్ తర్వాత అత్యధిక మంది వీక్షించే ఆటగా గుర్తింపు పొందిన క్రికెట్ లో ఐపీఎల్ ఒక సంచలనం. అటువంటి ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేసే హక్కులు పొందాలంటే..   

PREV
111
IPL Media Rights: ఈ నెలాఖరున ఐపీఎల్ మీడియా హక్కులకు టెండర్..? పోటీలో అగ్రశ్రేణి సంస్థలు

క్యాష్ రిచ్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత సీజన్ కు సర్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే వేలం ప్రక్రియ ముగిసిన ఈ సీజన్ కు.. ఈసారి మీడియా హక్కుల వేలం కూడా జరుగనున్నది.

211

ఈ నెలాఖారున  ఇందుకు సంబంధించిన టెండర్లను కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈసారి మీడియా హక్కుల కోసం ఏకంగా రూ. 50 వేల కోట్ల దాకా  ఆదాయం వస్తుందని బీసీసీఐ లెక్కలు వేస్తున్నది.

311

ప్రస్తుతం మీడియా హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ (డిస్నీ) ఒప్పందం (2018-2022 దాకా రూ. 1.7 బిలియన్ డాలర్లు) ఈ ఏడాది మార్చితో ముగియనున్నది. దీంతో కొత్త ప్రసారదారు (2022 నుంచి ఐదేండ్ల పాటు) కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించనున్నది. 
 

411

కాగా.. ఐపీఎల్ కు, టీమిండియాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈసారి మీడియా హక్కులను దక్కించుకోవడానికి స్టార్ నెట్వర్క్ తో పాటు సోనీ, జీ నెట్వర్క్ వంటి దేశీయ  ఛానళ్లే గాక ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలైన అమెజాన్,   రిలయన్స్ కూడా పోటీలో ఉన్నాయి. 

511

ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకోవడానికి  అమెజాన్, రిలయన్స్ ఎంతైనా  వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో 8 జట్లతోనే ఆడిన ఐపీఎల్ లో  ఈసారి పది జట్లు  చేరాయి. 

611

అంతేగాక ఈసారి ఐపీఎల్ రెండు నెలల పాటు జరుగనుంది.  అదీగాక  కరోనా నేపథ్యంలో  స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించకపోవడంతో  టీవీ, డిజిటల్ మీడియాలలో మ్యాచులను వీక్షించేందుకు ప్రేక్షకులు  ఆసక్తి చూపుతున్నారు. 

711

గతేడాది భారత్ లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్ ను ఏకంగా 350 మిలియన్ల మంది (సుమారు 35 కోట్ల మంది) వీక్షించారు.  ఈసారి కూడా ఐపీఎల్ బయో బబుల్ లోనే జరిగే అవకాశం ఉండటంతో   మ్యాచులను టీవీలలోనే చూసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కాసులను దండుకునేందుకు  బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. 

811

అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే  ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా  పూర్తి చేసిందని సమాచారం. ఎంత ఖర్చైనా సరే.. ఐపీఎల్ మీడియా టెండర్లను దక్కించుకోవడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. మరోవైపు  రిలయన్స్ కూడా తక్కువేమీ తినలేదు. 

911

భారత్ లో  రిటైల్ తో పాటు పలు రంగాలలో అమెజాన్ కు పోటీ ఇస్తున్న రిలయన్స్ కు.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో పాగా వేయడానికి ఐపీఎల్ ఎంతగానో సహకరిస్తుందని ఆ సంస్థ భావిస్తున్నది. జియోను  సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఐపీఎల్ మీడియా హక్కులను పొందడం కూడా లాభిస్తుందని రిలయన్స్ అనుకుంటున్నది. 

1011

మీడియా హక్కులను పొందడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనలు)ల రూపంలో భారీ ఆదాయాన్ని  పొందడానికి ప్రసారదారులకు అవకాశముంటుంది. ఇక  బెట్టింగ్ సంస్థలు ప్రకటనల మీదే కోట్లు ఖర్చు చేస్తున్నాయి. 

1111

ఇదే విషయమై  పారిమ్యాచ్ అనే బెట్టింగ్ సంస్థ హెడ్ ఆంటోన్ రుబ్లివ్స్కై మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఫుట్బాల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న ఆట క్రికెట్.  సుమారు రెండున్నర బిలియన్ల (రెండు వందల కోట్లు) కు పైగా ఐపీఎల్ ను చూస్తున్నారు. ఒకవేళ మీరు అక్కడ  (ఐపీఎల్ ప్రకటనలు) లేకపోతే మీరు మనుగడ సాగించలేరు’ అని చెప్పుకొచ్చాడు. 

click me!

Recommended Stories