పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఓటమి ఎరుగకుండా విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు రోహిత్ శర్మ. వరుసగా 9 మ్యాచుల్లో నెగ్గిన రోహిత్ శర్మ, విండీస్‌ను టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసి టీమిండియాని నెం.1 టీ20 టీమ్‌గా నిలబెట్టాడు..
కెప్టెన్‌గా స్వదేశంలో 15 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 14 మ్యాచుల్లో విజయాలు అందుకుని టాప్‌లో నిలిచాడు...
211
విరాట్ కోహ్లీ స్వదేశంలో కెప్టెన్‌గా 13 టీ20 విజయాలు అందుకుంటే, ఎమ్మెస్ ధోనీ 10 విజయాలు సాధించాడు. రోహిత్ ఈ ఇద్దరినీ అధిగమించేశాడు...
311
కెప్టెన్‌గా మొదటి 25 టీ20 మ్యాచుల్లో 21 విజయాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ 16 విజయాలతో రెండో స్థానంలో ఉంటే, ఎమ్మెస్ ధోనీ 14 విజయాలతో టాప్ 3లో ఉన్నాడు...
411
‘మేం ఛేజింగ్ కోసం టీమ్‌ను సెలక్ట్ చేశాం. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి చాలామంది రెగ్యూలర్ ప్లేయర్లు జట్టులో లేరు...
511
కాబట్టి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా, ఛేజింగ్ చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేలా జట్టును తయారుచేయాలనేదే మా టార్గెట్...
611
మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు కొత్తవాళ్లే. అయినా సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది. చాలామంది ప్లేయర్లు మిస్ అయినా, వెస్టిండీస్‌ను ఓడించగలిగాం...
711
జట్టును విజయాలు అందుకుంటూ వెళ్లడం చాలా అవసరం. వన్డేలతో పోలిస్తే టీ20ల్లో మిడిల్ ఆర్డర్ చాలా బాగా రాణించింది. బౌలర్లు కూడా బాగా రాణించారు...
811
హర్షల్ పటేల్ జట్టుకి కొత్త, ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేశాడు. శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తూ, పోతూ ఉన్నాడు.. ఎలాంటి పరిస్థితులనైనా ఫేస్ చేయడానికి ప్లేయర్లు సిద్ధంగా ఉండాలి...
911
శ్రీలంక సిరీస్‌కి కొందరు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చాం. ఎందుకంటే ప్రతీ ప్లేయర్ కూడా ఫ్రెష్‌గా ఉండాలి. మా ముందు ఇప్పుడున్న లక్ష్యం టీ20 వరల్డ్ కప్..
1011
మాకు ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, జట్టుగా విజయాలు అందుకున్నామా... లేదా! అంతే... ’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...
1111
శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...