భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్న ఈ గుజరాతీ ఆటగాడు.. గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా టెస్టులలో అరంగ్రేటం చేశాడు. ఆ సిరీస్ లో ఏకంగా మూడు టెస్టులలోనే 27 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ విజృంభణతో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు.. 3-1 తేడాతో విజయం సాధించింది.