Rohit Sharma: మరో అరుదైన రికార్డుకు చేరువైన టీమిండియా.. రెండు మ్యాచులు గెలిస్తే చరిత్రే..

Published : Feb 25, 2022, 04:49 PM IST

India Vs Srilanka T20I's: భారత నయా సారథి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో కొత్త చరిత్రను లిఖిస్తున్నది. ఇప్పటికే పది గెలుపులతో ఉన్న టీమిండియా...

PREV
110
Rohit Sharma: మరో అరుదైన రికార్డుకు చేరువైన టీమిండియా.. రెండు మ్యాచులు గెలిస్తే చరిత్రే..

ఇప్పటికే  మూడు (న్యూజిలాండ్ తో టీ20, విండీస్ తో వన్డే, టీ20) సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు మరో రికార్డుకు చేరువైంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో  మరో రెండు టీ20లను గెలిస్తే  రోహిత్ సేన చరిత్ర సృష్టించనుంది.
 

210

లంకతో రేపు, ఎల్లుండి ధర్మశాల వేదికగా జరుగబోయే రెండు,  మూడు టీ20 లలో  రోహిత్ సేన విజయం సాధిస్తే.. టీ20 క్రికెట్ లో వరుసగా  అత్యధిక విజయాలు సాధించిన జట్టు గా రికార్డులకెక్కనున్నది. 

310

టీ20లలో  వరుసగా 12 విజయాలు సాధించిన జట్టుగా ఆఫ్ఘాన్  ప్రపంచ రికార్డు సృష్టించింది. మార్చి 2016 నుంచి 2017 మధ్య ఆఫ్ఘానిస్తాన్..  వరుసగా 12 టీ20లలో గెలిచి  ప్రపంచ రికార్డు సృష్టించింది. 

410

ఈ జాబితాలో భారత్ ప్రస్తుతం 10 విజయాలతో ఉంది. ఇక తర్వాతి రెండు మ్యాచులు కూడా గెలిస్తే రోహిత్ సేన.. ఆఫ్ఘాన్ సరసన నిలువనున్నది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ తో ఓడిన భారత్..  ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘాన్ తో మ్యాచుతో  విజయాల బాట పట్టింది.  

510

అఫ్ఘాన్ తో విజయం అనంతరం భారత్.. స్కాట్లాండ్, నమీబియాలపై గెలిచింది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచుల  సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకుంది. 

610

అనంతరం విండీస్ తో  జరిగిన మూడు మ్యాచుల సిరీస్ ను కూడా 3-0తో  గెలుచుకుంది.   ఇక లంకతో లక్నో వేదికగా  ముగిసిన తొలి వన్డేలో  కూడా భారత్.. 62 పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఇది భారత్ కు టీ20లలో వరుసగా పదో విజయం. 

710

ఇక ఈ విజయాలలో విరాట్ కోహ్లి సారథ్యంలో మూడు విజయాలు ఉండగా,  రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఏడు  గెలుపులున్నాయి. టీ20 ప్రపంచకప్ అనంతరం  భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్న విషయం తెలిసిందే. 

810

వీటితో పాటు  రోహిత్ మరో రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశముంది. స్వదేశంలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన సారథిగా రోహిత్ చరిత్ర సృష్టించనున్నాడు.  ఇప్పటికే 13 మ్యాచులు గెలిచిన టీమిండియా (టీ20లు, వన్డేలు కలిపి)..   లంక తో సిరీస్ ను స్వీప్ చేస్తే 15 విజయాలు సాధించిన కెప్టెన్ గా రికార్డులకెక్కుతాడు. 

910

ఈ  జాబితాలో  న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ లు రోహిత్ కంటే ముందున్నారు.  

1010

ఇదే గాక..  లంక తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే వరుసగా మూడు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ల జాబితాలో ఉన్న పాక్ మాజీ సారథి షోయబ్ మాలిక్ సరసన రోహిత్ చేరనున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories