కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఏ ముహుర్తాన బాధ్యతలు తీసుకున్నాడో కానీ ఇప్పటిదాకా ఒక్క పరాజయం లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమిండియా. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లోనే ఈజీ విక్టరీ సాధించింది భారత జట్టు...
పూర్తి స్థాయి కెప్టెన్‌గా వరుసగా 10 మ్యాచుల్లో గెలిచిన రోహిత్ శర్మ, ఓవరాల్‌గా 16 మ్యాచుల్లో 15 విజయాలు అందుకుని అసాధ్యమైన రికార్డును నెలకొల్పాడు...
210
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ మినహా ఇస్తే, మిగిలిన మ్యాచుల్లో వన్‌సైడ్ విజయాలు అందుకుంది రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా...
310
లక్నో వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. టాపార్డర్ బ్యాటర్లు అదరగొట్టారు...
410
విండీస్ టూర్‌లో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ 57 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా టాప్‌లో నిలిచాడు...
510
కెప్టెన్ రోహిత్ శర్మ 44 పరుగులు చేసి అవుట్ కాగా వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆఖరి ఓవర్లలో మెరుపులు మెరిపించి 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు...
610
ఛేదనలో లంక ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసి వరుస విరామాల్లో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు భారత బౌలర్లు...
710
అయితే ఫీల్డింగ్‌లో మాత్రం భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా రెండు ఈజీ క్యాచులను డ్రాప్ చేశారు...
810
ఈ మ్యాచ్‌లో ఈజీ క్యాచులను డ్రాప్ చేశాం. కొన్ని సార్లు డ్రాప్ చేసిన క్యాచులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది...
910
లక్కీగా ఈ మ్యాచ్ గెలిచాం. అయితే ఫీల్డింగ్, క్యాచ్ ప్రాక్టీస్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో వీటిపై దృష్టి పెడతాం...
1010
ఎందుకంటే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ఎంతో సమయం లేదు. అప్పటికల్లా ఫీల్డింగ్‌లోనూ బెస్ట్ టీమ్‌గా మారాల్సిన అవసరముంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...