రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా రిషబ్ పంత్... టీ20 వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాకి మాజీ క్రికెటర్ల సూచన...

Published : Jul 07, 2022, 03:23 PM IST

అతి తక్కువ కాలంలో టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిపోయాడు రిషబ్ పంత్. ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత మూడు ఫార్మాట్లలో భారత జట్టుకి ప్రధాన వికెట్ కీపర్‌గా మారిన రిషబ్ పంత్, కొన్నాళ్లుగా పొట్టి ఫార్మాట్‌లో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

PREV
19
రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా రిషబ్ పంత్... టీ20 వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాకి మాజీ క్రికెటర్ల సూచన...
Image credit: PTI

2021 బ్రిస్బేన్ టెస్టు తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో సూపర్ స్టార్‌గా మారిన రిషబ్ పంత్, టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తూ టీ20 స్టైల్ ఇన్నింగ్స్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం టెస్టు ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు...

29
Rishabh Pant

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడం, ఇదే సమయంలో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా రీఎంట్రీ ఇవ్వడంతో పంత్ పరిస్థితి అయోమయంలో పడింది...

39

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా రిషబ్ పంత్‌ని టీ20ల్లో మిడిల్ ఆర్డర్‌లో, లోయర్ ఆర్డర్‌లో ఆడిస్తూ ఫినిషర్‌గా రాణించాలని ఆశిస్తోంది టీమిండియా. అయితే అతను అక్కడి కంటే ఓపెనర్‌గా అదరగొడతాడని అంటున్నారు భారత మాజీ క్రికెటర్లు...

49
Image credit: PTI

‘దూకుడుగా ఆడే వికెట్ కీపర్లను ఓపెనర్లను మార్చడంలో ఎలాంటి తప్పులేదు. ఇంతకుముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్ మిడిల్ ఆర్డర్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే ఓపెనర్‌గా మార్చిన తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో వండర్స్ చేశాడు. టెస్టుల్లో లోయర్ ఆర్డర్‌లో అయినంత మాత్రాన టీ20ల్లో ఓపెనింగ్ చేయకూడదనే రూల్ ఏం లేదుగా...

59
Image credit: PTI

రిషబ్ పంత్ ఆటతీరు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లాగే ఉంటుంది. దూకుడుగా ఆడే ప్లేయర్లను వారి స్టైల్‌ని మార్చకుండా ఉపయోగించుకోవాలి. అందుకే ఫినిషర్‌గా ఫెయిల్ అయిన రిషబ్ పంత్, ఓపెనర్‌గా అదరగొడతాడనే నమ్మకం నాకు ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

69

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘భారత థింక్ ట్యాంక్... రిషబ్ పంత్‌ని టీ20ల్లో ఓపెనర్‌గా పంపే ఆలోచన చేస్తే బాగుంటుంది. పంత్ లాంటి ప్లేయర్‌ని పూర్తిగా వాడుకోగల ప్లేస్ అదే...’ అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్...

79

2016 అండర్19 వరల్డ్ కప్ టోర్నీలో ఓపెనర్‌గా వచ్చి రాణించాడు రిషబ్ పంత్. నేపాల్‌డ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌తో కలిసి తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

89
Image credit: PTI

24 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసిన రిషబ్ పంత్, టీ20ల్లో ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అవుతాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

99
Image credit: PTI

రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కలిసి ఓపెనింగ్ చేస్తే భారత జట్టు టాపార్డర్ అత్యంత బలంగా తయారువుతుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... 

Read more Photos on
click me!

Recommended Stories